పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సెల విచ్చినదాని నిప్పుడేపోయి రాణిగారితో విన్న వించెదను. ఆమె నేఁటియుదయకాలముననే యాపసిబిడ్డను గొనిపోయి రాజుపాదములమీద బడవైవ సాహసించెడు పుణ్యాత్మురా లెవ్వరైనదొరకునాయని విచారింప జొచ్చినది." అని పలికెను. ఆమాటలకు సంతోషించి, "మాలినీ ! రాజుగారి సమక్షమున నేను దనపక్షమున ధైర్యముతో వాదించెదనని రాణిగారితో జెప్పుము." అని మిత్రవింద చెప్పెను. నిరపరాధినియైన రాణిగారికి మహోపకారమును జేయబూనుకొన్న నీకు శాశ్వత సుఖము కలుగునుగాక యని మిత్రవిందను దీవించి, రాణిగారితో సర్వము విన్నపముచేసి యామెప్రీతిపూర్వకముగా నిచ్చినయాబాలికను పొత్తులలోఁ గొనివచ్చి, మాలిని యా పుణ్యవతియొక్క చేతిలోఁ బెట్టెను.

అప్పుడు పుట్టిన యాపిల్లను పొత్తులలోఁ బెట్టుకొని నడచి, రాజు కోపమునకు భయపడి పోవలదని నిర్బంధించు నిజనాథుని వాక్యములనుసహితము లక్ష్యముచేయక, మూకలలోనుండి త్రోవచేసికొని రాజుసన్నిధికి బోయి, మిత్రవింద యా నెత్తురు గందును ఆయనపాదములమీఁద బడవైచి, మోమోటమి లేక యావఱకు రాజుచేసిన క్రూరకృత్యమును గర్హించి, యేదోషము నెఱుఁగని పిల్లను తల్లిని దయతో జూడమని బహువిధముల వేఁడుకొని, జాలిపుట్టునట్టుగా రాణిపక్షముగాఁ గొంతతడవు ప్రసంగించెను. ఆమె న్యాయనిష్ఠురము లాడి