పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంతటి స్థితిలోనికి వచ్చెను. రాజును తనరాణిని చెఱసాలకు పంపివేసి, చతురాస్యుడును సత్యసారుడును అనునిద్దఱు భృత్యులను బిలిపించి, మీరు తిరువనందపురముననున్న దుర్గ గుడికిబోయి మంజువాణికి నామీఁద మోహముకలదో లేదో,తెలిసికొని రండని పంపెను.

రాణి కొంచెముకాలము చెరసాలలో నున్న పిమ్మట, ఆమెకు కూఁతురు పుట్టెను. ముద్దులమూటగట్టు నాచిన్న కూఁతును జూచికొనుచుండుటవలన గొంత యూరట చెంది ఆమె "నాకన్నతల్లీ! నీ వెంతనిర్దోషురాలవో నేను నంత నిర్దోషురాలనేజుమీ" యని యాచిన్న దానిని జూచి పలికెను. ఆ పతివ్రతాతిలకమునకు రాజబంధు డైన వక్రచిత్తునిభార్య మిత్రవింద యనునామె ప్రియసఖిగా నుండెను. ఆబిడ రాణికి కూఁతురు గలిగిన దన్న వార్తను విన్నతోడనే యామె యున్న చెఱసాలకు బోయి, అక్కడ నామెకుపచారము నిమిత్తముంచబడిన మాలిని యనుపరిచారికం గాంచి "మాలినీ ! రాణిగారు నాయందు నమ్మక ముంచి కొమార్తెను నావశమున నిత్తురేని,ఆ చిన్న దానిని చూచుటవలన నైన నాతనికి మనసు కరగి రాణిమీద దయవచ్చు నేమో యెన రెఱుగుదురు" అని చెప్పెను. మాలినియు మిత్రవిందను జూచి "తల్లీ ! మీరు