పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుమిత్ర చరిత్రము

పూర్వకాలమున సింహళద్వీపమును సుమిత్రుఁ డను రాజు పాలించుచుండెను. ఆయనకు రూపవతియు, గుణవతియు నగు మంజువాణి యను రాణి గలదు. వా రిరువురును పరస్పరానురాగము గలవారయి, యపారమయిన సుఖము ననుభవించుచుండిరి. ఈ యుత్తమ నాయకామణితోడి ప్రణయము చేత, ఆతనికి బాల్యసఖుఁడును, సహపాఠియు నయిన చంద్రవర్మ యను మలయాళదేశపు రాజును మరలఁజూచి యాతనికి దన ప్రియభామినియొక్క సద్వర్తనమును జెప్పవలెనని యప్పుడప్పుడు పుట్టు అభిలాషతప్ప వేరుకోరిక యేమియు లేక యుండెను. సుమిత్రుడును చంద్రవర్మయు పిన్ననాటినుండియు నొక చోటనే యేకముగాఁ బెరిగిరి; కాని వారితండ్రుల మరణానంతరమున దమతమ దేశముల నేలుట కయిఁ యెడఁబాయ వలసి వచ్చినందున, వారు తఱుచుగా బహుమానములను, ఉత్తర 'ప్రత్యుత్తరములను, ప్రియపూర్వకము లయిన క్షేమ వార్తలను బంపుకొనిచుండినను బహుసంవత్సరములనుండి యనోన్య ముఖావలోకనములు మాత్రము లేక యుండిరి.

ఇట్లు కొంతకాలము జరుగఁగా సుమిత్రుడు తన్నొక సారివచ్చి చూచి పొమ్మని మిత్రునకు మాటిమాటికి వర్తమా