పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 సుమిత్ర చరిత్రము

గాఁబట్టి ప్రమతికిని రామవర్మకును మహావైభవముతో వివాహ మహోత్సవము జరిగెను. చిరకాలము కష్టపరంపర ననుభవించిన సుకృతాత్మురా లయిన మంజువాణియొక్క శ్రమ యంతయు నాఁటితో నివారణ మయినందున ఆమె పుత్రిక తోను బెనిమిటితోను గలిసి సకల సంపదలతోను దులఁదూగుచు బహుకాలము సమస్త సౌఖ్యముల ననుభవింపుచుండెను.


సంపూర్ణము

---o0(O)00---