పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభుని పుత్రికను దీవించినందున కంత యాశ్చర్యపడవలసిన పని లేదు - నిజముగా ఆ విగ్రహము జీవించియున్న రాణియే.

వెనుకటి యాపత్సమయమున రాణి ప్రాణములను గాపాడుటకు మఱియొక యుపాయము తోఁచనందున, మిత్రవింద యప్పుడు రాణి కాలము చేసినదని రాజుతో గొప్ప యసత్యమును జెప్పెను. నేడు ప్రమతి దొరికినదన్న శుభవార్తను వినువఱకును తాను జీవించియున్నట్టు రాజునకు దెలియుట యిష్టము లేనిదై, మంజువాణి యప్పటినుండియు యోగ్యురాలయిన మిత్రవిందతో గలిసి యన్యు లెఱుగకుండ నామె యింటనె తలదాచుకొని యుండెను. ఆమె రాజు తనవిషయమున జేసిన యాపదలను నాడే మఱచిపోయినను, నోరులేని పసిపిల్లవిషయ మయి చేసిన క్రూరకృత్యములనుమాత్రము మఱచిపోఁగలిగినది కాదు.

పోయినదనుకొన్న భార్య జీవించుటయు, చిన్ననాఁడే యెడబాసినకూతురు గృహము చేరుటయు, విలోకించి దీర్ఘ కాలము విచారములపాలయి యున్న యా రాజప్పుడు పొందిన యానందమునకు మితము లేదు. ఏమూల జూచినను సంతోష వాక్యములును మంగళతూర్యములును దప్ప మఱియేమియు వినఁబడ లేదు. సంతుష్టాంతరంగులైన యాదంపతులు హీనజాతి నాతిగా నెన్నఁబడినపుడు సహితము తమకూఁతును వరించినందుకయి రామవర్మను ఆమెను వాత్సల్యముతో బెంచి పెద్దదానిని