పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మును గొంతసేపు మఱచి తెరయైనను వేయ ననుజ్ఞయిండు; లేదా యింతకంటె నద్భుతము నొక దానిని జేసెద నందుకైన సమ్మతింపుడు. నిశ్చయముగానే నేనీ విగ్రహమును కదలునట్లు చేయఁగలను; అంతియేకాదు - దేవరవారి సెలవయ్యె నేని, పీఠమునుండి దిగివచ్చి మీహస్తము పట్టుకొనునట్టుసహితము చేయగలను. కాని నేనాలాగున జేసినపక్షమున, నేనేదో క్షుద్రదేవతయొక్క యుపాసనవలన జేయుచున్నా నని మీరు తలంతురు--- కాదని నేను ప్రమాణము చేయఁగలను" అని చెప్పెను. ఆమాటలకు రాజు విస్మయపడి, "నీవామెచేత నేమి చేయింపగలవో దానినంతను జేయింపుము; కన్నులపండువుగా జూచెదను. విగ్రహము చలించునట్టు చేయుదానికి మాటాడునట్టుకూడ జేయుట కష్టము కాదు; కాబట్టి ఆమెచేత నీవేమి పలికించిననుగూఁడఁ గర్ణరసాయనముగా వినఁగల" నని పలికెను.

ఈ పనికొఱ కావఱకే మిత్రవింద సిద్ధముచేసి యుంచిన వాద్యములును సంగీతములును మంగళధ్వనులతో మ్రోగసాగెను. చూచువారందఱును అద్భుత రసాక్రాంతు లగునట్టుగా విగ్రహమప్పుడు పీఠమునుండి దిగివచ్చి, చేతులతో సుమిత్రుని కంఠమును కౌగిలించుకొని, భర్తకును కూతురుకును శుభములు ప్రసాదించుటకయి భగవంతునిఁ బ్రార్థించుచు, మాటాడ సాఁగెను. ఆ విగ్రహమట్లు సుమిత్రుని నాలింగనము చేసికొని