పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రవర్మయు బహుమానుఁడును ఇద్దరును మారువేషమును వేసికొని గొల్ల వాండ్రు ఇంద్రోత్సవము జరిగించుచున్న సమయమున నావృద్ధగోపకుని మందిరముదగ్గరకు వెళ్ళిరి. వా రిరువురును క్రొత్తవారేయైనను, ఇంద్రోత్సవ సమయమున వచ్చినవారి నందఱిని ఆదరింతురు కాఁబట్టి, గొల్లవాడు వారి కతిథిసత్కారములు చేయుటయేకాక యుత్సవములో బ్రవేశించి తనతోడగూడ నానంద మనుభవింప బ్రార్థించెను. ఆనందభరితు లయి యెల్ల వారును త్రుళ్ళుచు కేరుచు నుండిరి. కులమువా రందఱును బంతులుసాగి కూరుచుండిరి; ఎక్కడ జూచినను ఉత్సవమునకువలయు సంభారములు కూర్పబడు చుండెను; చిన్నపిల్లలును పిల్ల వాండ్రును గృహముముందఱ నున్న పచ్చికబయలిమీద గంతులు వేయుచు కేరుచుండిరి. వారికంటె పెద్దవాండ్రు గుమ్మమువద్దకు వచ్చిన మన్నారు వానియొద్ద బొమ్మసామానులను ఇత్తడి నగలను అద్దములను గొనుచుండిరి.

ఈప్రకార మందఱును సందడిగానుండఁగా రామవర్మయు ప్రమతియు అక్కడ నడుచుచున్న వేడుకలయందుఁ బ్రొద్దు పుచ్చుటకంటె నన్యోన్యమును సరససల్లాపములతో కాలక్షేపము చేయుటకయి మిక్కిలి కౌతూహలము కలవా రయి యా సమ్మర్దముపొంతకుఁ బోవక దూరముగా నొక రహస్య స్థలమునఁ గూరుచుండిరి. తన కొమారుడు తన్నెంతమాత్రము