పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాక్యములయందును నమ్మకము తోఁచెను; కాఁబట్టి, తన పోయినకూఁతురునిమిత్తమయి తన రాజ్యమునైనను విడిచిపెట్ట వలెనని నిశ్చయించుకొని రాత్రిందివములు దు:ఖసముద్రములో మునిగియుండి, బహుసంవత్సరములు వ్యసనముతోను దీర్ఘ విచారముతోను రాజు కాలమును గడపుచుండెను.

వక్రచిత్తుడు రాజపుత్రిక నెక్కించుకొనిపోయినపడవ గాలివానవలన గొట్టుకొనిపోయి, చంద్రవర్మ రాజ్యము చేయుచున్న మలయాళదేశతీరముననే చేరెను. వక్రచిత్తుఁ డక్కడదిగి కావుకావున నేడ్చుచున్న యాపసిపిల్లను దయ మాలి యొకచోట విడిచిపెట్టి తనపడవవై పునకు వెళ్ళెను. కాని 'నీకూఁతు నచ్చట దిగవిడిచి వచ్చినా' నని సుమిత్రునితో జెప్పుట కయి సింహళద్వీపమునకుమాత్ర మాతడు మరల రాలేదు. ఆతఁడు వెనుకదిరిగి తనపడవలోనికి వెళ్ళుటకయి పోవుచుండగా, చేరువయడవిలోనుండి యొక వ్యాఘ్రము వచ్చి యాతనిపయికి దూకి, మెడ పట్టుకొని చంపి తనప్రభువు యొక్క దుర్మార్గమయిన యాజ్ఞను నెఱవేర్చనందునకై తగిన శిక్షను చేసిపోయెను. రాణి యాచిన్న దానిని రాజుకడకంపి నప్పుడు సాధ్యమయినంత యందముగాఁ గనబడునట్లు చేసి మఱి పంపినది. కాబట్టి, యిప్పు డాచిన్నది యమూల్యవస్త్రములతోను రత్నఖచితము లయిన స్వర్ణాభరణములతోను అలంకరింపఁబడి యుండెను. వక్రచిత్తుఁడును తాను బైలుదేఱి