పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుట కయి విమర్శచేయుచున్నా రని విని వ్యసనము చేతను సిగ్గుచేతను దేహమును మఱచి యాకస్మికముగ మృతినొందెనని చెప్పెను.

ప్రియనందనుఁడై నకృష్ణుఁడు తనకుసంభవించినదురవస్థ కయికుంది ప్రాణములు విడిచినాడన్న వార్త చెవిసోకినతోడనే మంజువాణి మొదలునఱికినయరటిచెట్టువలె నేలమీఁదఁపడి మూర్ఛపోయెను. పుత్ర మరణవార్త రాజహృదయమునకు శూలమువలె నాటినందున, అభాగ్యురాలైన యిల్లాలియందు గొంతకనికారము జనించి, రాజు తత్క్షణమే మిత్రవిందను ఆమె పరిచారికలను బిలిచి రాణిని ఆవలకు దీసికొనిపోయి శైత్యోపచారములు చేసి మూర్ఛ తేర్పుఁ డని యాజ్ఞాపించెను. రాణి నావలకుఁ గొనిపోయిన కొంతసేపటికి మిత్రవింద మరల జనుదెంచి, ఆమె మరణము నొందెనని చెప్పెను.

సుమిత్రుఁడు భార్య మరణము నొందెనని విన్నప్పుడు, ఆమె విషయమయి తానుచేసిన క్రూరకృత్యములను చింతించి పశ్చాత్తాపపడఁ జొచ్చెను. తానామెను పెట్టినబాధలవలననే యామెమనసు వికలత్వము నొందెననియు, ఆమె నిరపరాధిని యనియు నిప్పుడు తలఁచెను; ఉన్నయొక్కుకుమారుడుఁను మరణము నొందినాడు. కాఁబట్టి చంపబడినకూతురు మరల దొరకనిపక్షమున దాను సంతానము లేకుండ మృతినొంద వలసినది. వాస్తవముగాఁ గనఁబడఁబట్టి యిప్పు డాదేవతా