పుట:Sukavi-Manoranjanamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తొలిపలుకు

సాహిత్య ప్రపంచమున కూచిమంచి తిమ్మకవిని, జగ్గకవిని ఎరుగని వారుఁడరు. సుకవి మనోరంజసము కూచిమంచి వేంకటరాయ ప్రణీతము. హరి వంశీయులైన శ్రీ కె. కామేశ్వర రావు గారు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి తాళపత్ర గ్రంధము పంపగా, దానిని తిరిగి వ్రాయించి పరిశీ లించుట జరిగినది. 'తేలిన దేమనగా పరిపూర్ణ గ్రంథ మెచ్చటను దొరకుటలేదనీ, ఇది ప్రచురణ యోగ్యమనీ; ఆ మేరకు ఆకాడమీ కార్యవర్గము దానిని ముద్రింప నిర్ణయించి దానికి పీఠికను సిద్ధముచేయు బాధ్యతను శ్రీ కో వెల సంపత్కుమా రాచార్యుల వారి కప్పగించినది. ఆ పిఠికతో గంథము వస్తు తము వెలువడినది.

ఈ గ్రంథము కేవలము వ్యాకరణ గ్రంధము కాని ఛందోగ్రంథము కాని కాదు. మిశ్రమమై, అనేక అంశములతో కూడినది. చింతామణి, బాల సరస్వతీయము, అధర్వణ కొరికావళి, అప్పకవీయము, అహా' బలపండితీయ ములకు, ఇది వ్యాఖ్యాప్రొయ మైన గ్రంథమనవచ్చును. అప్పకవితో భేదించిన సందర్భములు యిందు పొందుపర్చనై నది. విరివిగా పూర్వగ్రంథ ములనుండి ఉదాహరణములీయనై నది. కొన్ని వ్యావహారిక ప్రయోగము లకు సాధుత్వము కల్పించిన రీతియు ఇందు గమనింపదగినది, ఛందో వ్యాకరణ విషయముల కీదీ సాధికార గ్రంథమని కొంద రభిప్రాయపడుచున్నారు. ఈ గ్రంథమునకు అనంతరము ఇట్టి ప్రయత్నము జరిగినట్లు కనబడదు,

ఇట్టి అవకాశమును సద్వినియోగము చేసికొని ఆంధ్ర లాతుణికుల కిట్టి అపూర్వగ్రంథమును సమర్పించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తన ఏధ్యుక్త ధర్మమును కాను నేర వేర్చుకొన్నది.

ఈ గంధము తాళ పళపతిని అకాడమీకి యిచ్చిన శ్రీ కె. కామేశ్వర రావు గారికి, వారిని అకాడమీకి పరిచయముచేసిన శ్రీ బి. కృష్ణ గారికి కృతజ్ఞతలు, కో గినంత నే యీ గంధమును పరిశీలించి వాతప్రతిని సిద్ధముచేసి పితికను వాసిన డా. కోవెల సంపత్కుమారాచార్య గారికి, అకాడమీ పహన అనేక ధన్యవాదాలు.

హైదరాబాదు దేవులపల్లి రామానుజరావు 1-1-1878, కార్యదర్శి,