పుట:Subhadhra Kalyanamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52


కాలిపెండెము గూర్చె - ఘనత తోడు తను
అందెల దిద్దె నా - యతివ సుభద్ర
తళుకు మించిన నంది - దండల పైని
నెలవంక తాయితల్ - నెఱి పుట్ట గట్టె
శ్రీ కారములతోడ - చెలగాడు చెపుల
కమలాక్షి పంజుల - కమ్మలె పెట్టె
సొమ్ము లిన్నిటి మీద - శోభిల్లు నట్టి
మూడు వేలుంజేయు ముక్కఱ పెట్టే
కుంకమ గంధము - కూర్చె నా యింతి
దోవకస్తురి బూసె - కొమరాలి మేన
ఆనవాల్ పాయసం - బావుల నేయి
పొలతు లందఱు గూడి - సొత్తారగించి
పచ్చివౌ పోకల - పండు టాకులను
వెచ్చగా పప్పర - వీడెమ్ము జేసె
గరిమతో రాచిల్క - కంకణమ్మునను
రాజసమ్మున నునిచె - రమణి సుభద్ర
ఝుణఝుణత్కారమై - పణతులిద్దఱును
జోడు చిల్కల వలె - శోభిల్లి రపుడు
అక్కడ ధర్మజుం - డర్జునునకును
అతిర కితోనలం - కృతులు సేయించె
సవ్య సాచిని జూచి - నన్న గావించె