పుట:Subhadhra Kalyanamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50


వేవేల యత్నముల - విందు తగ జేసె
నొప్పైన బంగారు - టుప్పరిగ లోను
కప్పుర వాసనల్ - గ్రమ్ముకొనంగ
సాంబ్రాణి ధూమములు - సఖి తాను వేసి
చిత్రముల్ నిర్మించె - చెలియ యంతటను
దిక్కుల మాణిక్య - దీపముల్ వెలుగ
నిలువు టద్దమ్ముల - నెలత చెక్కించె
వెయ్యి దీపమ్ములు - వెలుగంగ నందు
గవుసెనల్ దీయించె - గాజు కంబముల
బంగారు తరి కోళ్ళ - పట్టె మంచమ్ము
అంగన వెలయించి - యమరించె సెజ్జ
సన్న విరిమల్లెలు - జాజి మల్లెలును
బొండు మల్లెలు చాల - నిండ బరపించి
యిరుదెసల్ తలగడ - లిమ్ముగా దాసి
బంగారు సురటి దా - పణతీ వెట్టించె
పంకించి బాగాలు - బరణులం బోసి
గాలించి సున్నము - కాయ బెట్టించె
పండు టాకులు దెచ్చి - పణతి ముడిపించి
మదిరాక్షి యునిచెను - మఱియు నచ్చటను
చాఱపప్పు గనగ - సా లానవాలు
శ్రీ సుగంధమ్ములు - చిటి బెల్లములును