పుట:Subhadhra Kalyanamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47


అటు పట్టి తెచ్చేము - యిటు మమ్ము బనుపు
మిదెయని చారులు - నీవిధి బలుక
విని వారి నందఱి - వేగ వారించి
బలభద్రుతో నిట్లు - పలికె శ్రీ కృష్ణు
డనఘుడు ధర్మజ్ఞ - డతి నీతి పరుడు
తన మేన మరదలి - తాను గొంపోయె
వలదని యెవరికి - నారింప వశము
బలవంతు డాతడు - బహుశస్త్ర వేది
అటుగాక ద్రోణుల - కనుగు శిష్యుండు
కదనములో వాని - కదియంగ దరమ
యెదిగిన కన్య మన = యింటిలో నున్న
మనము చేయక యున్న - మగువ బెండ్లాడె
తలవ నీపనులకు - ధర్మమా యనిన
నబ్జాక్షు మాట కం = తౌను గాదనక
తాలాంకు డప్పుడు - తలయూచి యుండె
తల్లియు దండ్రియు - తగిన బాంధవులు
బల్లిదు లన్నలు - పాయ కుండంగ
నొక పేద వలె పాయ - నువిద సుభద్ర
సుదతి నీరీతిగా - చూచు చుండుదుగ
అని వెడబాటుగా - నన్నతో జెప్పి
అనుగు చెల్లిలికిని - ఆరణముల్ గొంచు