పుట:Subhadhra Kalyanamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43


బిలువ రిప్పుడె నిన్ను - బిలిచి తెచ్చెదరు
తల దువ్వ నిప్పిడే - తా బిలుచు గాని
యిచటికి బోయి రా - యిభరాజగమున
నానదినె యుండ వే - నా ముద్దు చిలుక
అని బుజ్జగించేటి - అసమయమున
ఘన కోటి సూర్య ప్ర - కాశమ్ము భాతి
మకుటమ్ము ధరియించె - మఱియు నర్జునుడు
నిచ్చేసె నంతలో - విజయు డా సతికి
నచ్చిక దండ ప్ర - ణామమ్ము జేసె
నీర జాక్షుని రాణి - నిత్య కళ్యాణి
దారిద్ర్యనాశిని - దయగల తల్లి
పాందునందనులుకు - ప్రావవై యెపుడు
కృప జూచి రక్షించు - కువలయ నేత్ర
మన్మథుని గన్నట్టి - మరువంపు మొలక
మమ్ము కటాక్షించు - మాధపు రాణి
అనుచు ఫల్గునుడు త - న్నతిభక్తి తోడ
స్తవము జేయుచు నున్న - కువలయ నేత్ర
మకుటమ్ము వట్టి క - వ్వడి లేవనెత్తె
సత్య కృపాచార్య - సత్య సంపన్న
సత్యము దప్పని - సర్వజ్ఞ నరుడ
చెలువతో సధ్బక్తి - శ్రీ కృష్ణు సేవ