పుట:Subhadhra Kalyanamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42


అప్పుడు కవ్వడి - యా సుభద్రయును
హరి పాద పద్మముల్ - హర్షమున మ్రొక్క
కడు గారవమ్మున - కౌగిట జేర్చి
కడలేని యక్షమ - కాండము లొసగె
రయహయంబుల హేమ - రథమును నొసగె
హరియు రుక్ంఇణి సూచి - అప్పు డిట్లనిరి
అలరెడి వేడుకల - ననుగు మరదలిని
హోమ పీఠమ్మున - మనిచిరి వారు
అక్షతల్ శిరసుపై - నాయిర్వురుంచి
ముత్య రత్నమ్ములు - ముగుద యొడినిడిరి
సిగ్గు మురిపెమ్మున - చెలియ సుభద్ర
వద్దికి చనుదెంచె - వదిన ముందఱికి
పుత్తడి బొమ్మ వలె - పొలతి సుభద్ర
వదిన పాదములపై - వ్రాలుచు మ్రొక్కె
మ్రొక్కిన మరదల్ని - మొగి గౌగిలించి
అక్కున జేర్చుకొని - అతివ యిట్లనెను
అడల నేమిటికె మా - యమ్మ సుభద్ర
అత్తయు నీకు మే - నత్తయు గాన
వింత వారెవ్వారు - వీరి లోపలను
బావమఱదులు చాల - భక్తి గలవారు
నిను విడిచి మీయన్న - నిమిష మేనియు ను