పుట:Subhadhra Kalyanamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38


దేవేంద్ర సుతు దృష్టి -తెగువతో తాకె
దృష్టి తీయింతుమే - తెలివి రా నీకు
తెగనాలు కన్నుల -దృష్టించి చూడ
ఆతని చేతనె కాని - అది మాన దనెను
చిటిమిటి కోపాన - చెలియ సుభద్ర
కర కంకణములచే - కాంతి శోభిల్ల
ఆరుక్మిణమ్మను - అవలికి ద్రోసె
గట్టిగా ముసుగిడి - కాంత యిట్లనెను
యింతి నీపలికిన - యీ పలుకు లన్ని
త్రైలోక్య పతితోడ - తా విన్నవింతు
అనిన మరదలి జూచి - అతివ యిట్లనెను
యిప్పుడే చెప్పవే - యిభ రాజగమన
మీయన్న మము గూర్చి - మించ నాడు నటె
జలక మాడుదు లేవె - పుత్తడి బొమ్మ
వెలది నీకును పెండ్లి - వేగ జేయుదుము
అని చెప్పి వైదర్భి - యరుదెంచె నంత
నందమౌ నిందిరా - మందిరమ్మునకు
ఆ యింతి పెట్టె నా - యా సొమ్ము లన్ని
తాటంకముల కాంతి - డవళింప గాను