పుట:Subhadhra Kalyanamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35


చేకొని సమకూర్చు - చింత యేమిటికె
అరయ గంధర్వ క - ళ్యాణమ్ము రాజ
వరులకు తగునండ్రు - వరధర్మ పరులు
అనుచు తమకమ్ముతో - అస్తడు చేయి చాప
ఘనమైన సిగ్గుతో - కాంత యిట్లనెను
తల్లియు తండ్రియు - తగిన బాంధవులు
బల్లిదు లన్నలు - పాయ కున్నారు
వారి యనుజ్ఞచే- వర్తించు మిచట
నీలాగు పనులైన - యిందఱు నగరి
హరి నీకు నిచ్చట - అనుమాన మేల
తెరలి యేనుగునెక్కి - దిడ్లు దూరెదరె
అని చెప్పి తా నగరి - కతివ పోయినను
మునియు లతాగృహ- మ్మున కపుడు చెనియె
మదనునిచే జిక్కి - మత్తాక్షి రాక
కెదురైదురై చూచి - యిట్లని పలికె
యింతికి నాపేర - దేల చెప్పితిని
కాంతయు లోనికి -గ్రక్కున బోయె
మరుని పుత్తడి బొమ్మ- మరలె నాచేతి
పరిచర్య లొనరించ- భాషించ దొక్కొ
సుందరి పాదాల - యందియల మ్రోత
విందునో వీనుల - వెరగందు నొక్కొ