పుట:Subhadhra Kalyanamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

-- గా చిరంజీవి విద్వాన్ పి. పార్థసారథినాయుడు పరిశోధన -- విద్యార్థి వ్రాసెను.

అన్నమాచార్యోత్సవము నాటి కాయన యిల్లాలి గేయరచనమును దీనిని వెల్వరింపవలయునని వడివడిగా దోషసహస్రము దిద్దుచు నచ్చున కిచ్చుచుండగా ప్రెస్సు మేనేజరు శ్రీ T. R. నరసింహంగారు, కంపోజిటర్లు శ్రుతికలిపి వడిగా వారములో ముద్రణము ముగించిరి. ఈ ద్వితీయ వర్షాన్నమాచార్యోత్సవమున (విరోధి ఫాల్గున బహుళ దశమి) వెల్వడిన యీ గ్రంథము, సర్వసమ్మతముగా శ్రీ సి. అన్నారావుగారు కమీషనరుగాను, శ్రీ సి. రామస్వామిరెడ్డిగారు పేష్కారుగాను, శ్రీ తిరుపతి దేవస్థానమున నుద్యోగించుటకును, భారతదేశము సంపూర్ణస్వాతంత్ర్యము పడయుటకును, జ్ఞాపకముగా వెలయగలదు.

తిరుపతి: 13-3-50

వే. ప్రభాకరశాస్త్రి