పుట:Subhadhra Kalyanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుభద్రాకల్యాణము

13


భుక్తి ముక్తి ప్రియు - పుండరీకాక్షు
భక్త వత్సలు కృపు - పరమాత్ము కృష్ణు
తత్తర వడక చి - త్తమ్ములో నునిచె
అంతనా నరుని తల - నంతయు దెలిసి
యొక్కరుండేతెంచె - నొనర నచ్చటికి
నరుడు నచ్చెరు వంది - నారాయణునకు
సరగున ప్రణమిల్లి - సభక్తి మొక్కి
వనమాలి కెదురుగా - వచ్చి యర్జునుడు
దండ ప్రణామమ్ము - తగ నాచరించె
నారాయణా యనుచు - నవ్వుచు నరుడు
కరము బట్టుక వాని - కడు లేవ నెత్తె
హరియు నవ్వుచు బల్కె- నర్జుని జూచి
నిన్ననే సుతుల గని - నెఱతనమునను
యింతలో సన్యాసి = వెట్లయితి వయ్య
యెరుగుచుము ఈవిద్య - లెల్లను మేము
గరిమ వేసాలల్ల - గ్రాసాల కొఱకె
అని గేలి సేయుచు - నతి దోకొనుచు
చనుదెంచె రైవత - సైలమ్ము కడకు
అచట నర్జును నుంచి - హరియు నంతటను
నడవడచి ద్వారకా - నగరి కేతెంచి