పుట:Subhadhra Kalyanamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనఘుడు బభ్రువా - హనుడను సుతుని
వరచిత్రఘను చిత్ర - వాహనువంశ
కరునిగా నొసగి యా - కాంత దిగ విడచి
స్థిరముగా గోకర్ణ - దేవు దర్శించి
అరిగె నవ్వలిపార్శ్వ - మంబుధిచెంత
పావనంబైన ప్ర - భాసతీర్థమున
భావజాకారుడు - పార్థు డుండగను
చేరువ నంత నా - శ్రీకృష్ణు డుండు
ద్వారకాపురియని - తగు మునుల్ పలుక
నీలమేఘశ్యాము - నిఖిలాభిరాము
లాలితశుభగాత్రు - లక్ష్మీకళత్రు
అకంజదళనేత్రు - నలరి సేవింప
నాకోర్కె లెల్లగ్ర - న్నన సమకూడు
గదునిచే మును వింటి - కన్య సుభద్ర
మదిరాక్షి సుకుమారి - మత్తేభగమన
గుణవతి యనగ మ - క్కువ చూడ వలెను
క్షణమైన నా కొమ్మ - కనుగొనవలెను
అనుచు ధనంజయు - డా ద్వారవతికి
చన నున్నతలపున = సకలయాదవులు
యతుల బూజింతు రన్ - మతిగల్గి కపట
యతివేషధారియై - యలరి యర్జునుడు