పుట:Stree Neethi deepika.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే.గీ. సంపదలు వచ్చినప్పుడు సాదరముగ
నట్లుదయచేసినందుకు, నాపదైన
యపుడు శీఘ్రముగా దాని నణఁచివేయ,
మఱవకుఁడి దైవమును వేఁడ మగువలార! 5.

బంధుప్రీతి
తే.గీ. పుడమిఁ దలిదండ్రులును దోడఁబుట్టువులును
గాక, మిగులువారెందైనఁ గలుగఁగలరు;
కావునను, వారియెడఁ బ్రేమ గలిగి యెపుడు
వారిమాటలో మెలఁగంగవలయుఁ జెలువ. 6.

ఆ.వె. అత్తమామలకును నాఁడుబిడ్డలకును
మనసు నొవ్వకుండఁ బనులు చేసి
నడుచుచుండవలయుఁ గడునడంకువతోడ
శ్రేయ మెదను గోరు చెలువ లెల్ల. 7.

తే.గీ. ఒక్కకడుపుననే పుట్టి, యొక్క కంచ
ముననె భుజియించి,యొకమంచముననె పండి
యుండు తోఁబుట్టుపడుచులు సోదరులును
నెప్పు డన్యోన్యమైత్రితో నొప్పవలయు. 8.

గురుభక్తి
తే.గీ. విద్యచెప్పిన గురువుల విషయమునను
మిక్కిలి కృతజ్ఞతను గల్గి మెలఁగ వలయు,
వారలే తమయుక్త ప్రవర్తనకును
దగు సహాయులని యెఱింగి తరుణిమణులు. 9.