Jump to content

పుట:Srungaramaruka Kavyam By Veturi Prabhakara Sastry In Telugu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

శృంగారామరుకావ్యము

5

10


గురుసన్నిధియందు నత్యంతాసక్తులయిన నాయికానాయకుల యలుకతో గూడిన శృంగారము.

ఉ॥ రాగమయాపగారయభరంబునఁ గాముకు లట్లు డాసి తా
      మా గురుసేతుబంధమున నాఁకకు లోనయి కాఁకదీఱమిన్
      బాగుగ వ్రాసిన ట్లవశభావము నొందఁగ మేను లంగ సం
      యోగరసంబు నానిరి దృగుజ్జ్వలసారసనాళసంగతిన్ 60

11



ముగ్దానాయికాలబ్దసంభోగశృంగారము.

చ॥ విలసనమందిరం బతి వివిక్తముగాఁగని, సెజ్జనుండి నీ
      శ్చలగతి నింత లేవక యసత్యపు నిద్దురవోవఁ, గాంతు మో
      మలవడఁ జూచి, ముగ్ధ తమియారఁగ ముద్దిడుకొంచుఁ జెక్కులం
      బులకలు గాంచి, సిగ్గుపడ ముద్దిడెఁ, గాంతుఁడు దాను నవ్వుచున్ 74

12



నవోఢానాయికాలజ్జా చేష్టితము.

చ॥ చెలువుఁడు కేళికాంతమునఁ జేల మొసంగమిఁ బాదలగ్నమే
      ఖలయయి పోనరాక, కరకంజవిధూననచేతఁ గేళికా
      గళిత లతాంతపాతమునఁ గ్రక్కున నత్తఱి దీపమాఱమిన్
      గలికి విలోకనేచ్చుఁడగు కాంతుని కన్నులు మూసె నవ్వుచున్ 89

13



నాయిక విరహాక్షమత్వ రూపౌత్సుక్యము.

ఉ॥ కామిని యల్క నవ్వలిమొగంబయి కైతవనిద్రఁ జెందఁగాఁ,
      గాముకుఁ డంగభేద మెఱుఁగంబడకుండఁగఁ గౌఁగిలించి వే
      దామరఁ ద్రాసభారచలితంబుగ నీవిక యంట, నా వధూ
      టీమణి యానుకూల్యము ఘటించె, వలగ్నము నక్కళింపుచున్ 90

14



నాయికా కాలాక్షమత్వ రూపౌత్సుక్యము.

ఉ॥ అంగన దూరదేశగతుఁడౌ పతి బవలెల్లఁ గోర్కి చే
      తం గడుఁ దేరఁజేసి, రతిధామముఁ జేరి, సఖీమణుల్ కథా
      సంగతిఁ బ్రొద్దుపుచ్చ, [1]నెదొ చట్టనఁ గుట్టె నటంచుఁ బల్కుచుం
      గొంగు విదల్చి కేళిపయిఁ గోరికఁ దీపముఁ ద్రెంచె, నేర్పునన్ 86

15



ధూర్తనాయకునిచేత వంచితయైన ఖండితనాయికావ్యాపారము.

ఉ॥ వాతెఱ వింతగం ట్లలర వచ్చుపతిన్, సతి కేళికాసరో
      జాతముచేత వ్రేయఁగ రజంబిదె రాలె నటంచు, మూసికో
      నాతఁడు కన్గవన్, బ్రమసి యంగన పూతృతు లందు నించగా
      నీ తఱి ముద్దు పెట్టుకొనియెన్ సతి నొక్కతె ధూర్తు నేర్పునన్ 80

16



వాసకసజ్జిక పరిణామాలంకారరూపమున నాయికా సౌందర్య వర్ణనము.

చ॥ చెలువుఁడు వచ్చువేళ, సరసీరుహలోచన మంగళార్థమై
      కలువలఁ గాదు, తోరణముఁ గట్టుట వాలికచూపుదండనే
      యలరులఁ గాదు, మించు నుపహారము నవ్వునఁ గాని, యర్ఘ్యముల్
      కలశగతాంబుపూరమునఁ గాదు చెమర్చు నురోజపాలినే 40

17



ముగ్ధా నాయికాసఖీ జనోపదిష్టేర్ష్యాపూర్వక సంభోగశృంగారము.

చ॥ చెలి యపరాధియైన పతిచెంగట వ్యంగ్యములెన్ని యాడు మం
      చలవడఁ బల్కి రన్నియు రయంబునఁ బల్కి మనోజునాజ్ఞలో
      మెలఁగఁగఁ జొచ్చె నంత సతి మిక్కిలి గోలతనంబు సొమ్ముగాఁ
      గల యనురాగపున్ సతినిఁ గాంతుఁడు సెజ్జకుఁ దార్చె నత్తఱిన్ 43

  1. నదె చంద్రుఁడుదూఱె