2
శృంగారామరుకావ్యము
3
చ॥ చెలువుఁడుఁ దాను, మన్మథవశీకృతులై తమ రాతి రన్న ప
ల్కులు మఱునాఁడు నెల్లజనులున్ వినఁ బల్కెడు చిల్కఁ జూచి, సి
గ్గొలయఁగఁ గాంత, కమ్మఁ దళుకొత్తెడు కెం పటు దీసి, దాడిమీ
ఫలమునె [1](పానఁజంచుపుట?) పాళి నమర్చుచు నిల్పెఁ బల్కులన్ 15
4
అత్యనురక్తులైన నాయికానాయకుల సంభోగశృంగారము.
చ॥ ఋతుమతి యౌటఁ, బాన్పునకు నింతయు దవ్వుల నిల్చి, కాంతుఁడం
చితరదనచ్ఛదస్ఫురణచే బొమసన్నల ముద్దు వేఁడఁగా,
స్మితవికసత్కపోలములఁ జెన్నగు మో మటు గప్పి కొంగుచే
సతి తల యూఁచె నొయ్యన లసన్మణికుండలముల్ చలింపఁగన్ 67
5
బహునాయికా మనోరంజనచతురుండగు దక్షిణనాయకుని చేష్టితము.
చ॥ ప్రియతమ లిద్దఱొక్క మణిపీఠిక నుండఁగ, వెన్క నేఁగుదెం
చి యొకతె కన్నులన్ నగవుచేబలె మూయుచు, మోముఁ ద్రిప్పి వే
ఱ యొకతె చెక్కులన్ బులకరాజియు లేనగవుం జెలంగఁగా
దయితుఁడు ముద్దువెట్టుకొనె, దక్షిణభావము బోంట్లు మెచ్చఁగన్ 18
6
ప్రణయరోషార్థమై చెలికత్తెలు బోధింపగాను కపటకోపమును నటించే నాయిక యొక్క నాయకవశ్యత్వము.
చ॥ బిసరుహనేత్ర, యేమిటికి బిగ్గ ముసుంగిడి నిద్రవోయెడిన్
గిసలయపాణి! యంచుఁ బతి కేవలమున్ జెలిఁ బల్క లేని యీ
రసమున నమ్మ! నిద్దురకు రాయిడిసేసె నటంచు నోరయై
పొసఁగఁగ నిద్రవోవుగతిఁ బొల్తుక దా నెడయిచ్చెఁ బాన్పునన్ 20
7
ముగ్ధనాయికా లజ్జాకులభావము.
ఉ॥ కాంతుఁడు కొంగుఁదీయ, నొడికంబున మో మరవంచె బల్మిచే,
నంతటఁ గౌఁగిలించుసమయంబున నెమ్మెయి యోరఁజేయుచున్,
జెంతల నవ్వునెచ్చెలులఁ జెల్వుని మానుపుఁ డంచుఁ బల్కలే
కెంతయుఁగ్లాంతిఁజెందెఁ, [2]దరళేక్షణ సిగ్గున నూత్నసంగతిన్ 36
8
పూర్వము మౌగ్ద్యముచేత నాయకునితో స్వేచ్ఛావిహారము లేక కాలము గతించె నని ప్రౌఢిమచేత స్వైరవిహారసౌఖ్యము ననుభవించే నాయిక పశ్చాత్తాపము.
చ॥ ప్రియుఁడు కవుంగిలించునెడ బిగ్గిలఁ జేర్పక, ముద్దుఁబెట్ట నిం
తయు మొగ మెత్త, కాతఁడు గనం దివురం గనుఁగోక, పల్కుచో
నయినను బల్క కే ముగుదనై మును వంచిత నైతి నంచుఁ బ్రే
మ యెసఁగుటన్ రసజ్ఞయయి మానిని చెందెఁగృశానుతాపమున్ 51
9
నాయకుడు తన సురతోత్కంఠాతిశయమును సరసచేష్టావ్యాజమున బ్రకటముసేయగాను, చెలికత్తెలా కీలెఱింగి నేర్పున నవ్వలికిబోయే వృత్తాంతము.
చ॥ అలరుపసిండి వంటి తనుయష్టికి నీ ఱవికేల మాటుగా
జలజదళాక్షి! యంచుఁ బతిసయ్యనఁగ్రొమ్ముడి గేల నంటఁగాఁ
దలిమముచెంత నున్న సఖి తమ్ముల నవ్వు చెలంగఁజూచినన్
జెలులును మెల్లనే నెపము సెప్పుచు వాకిటి కేఁగి రందఱున్ 25