14
శృంగారామరుకావ్యము
15
49
ఈర్ష్యాకలుషిత తిరస్కృతుండైన నాయకుండు నాయిక సౌందర్యమును దలఁచుకొని ఖేదమున ననేమాట.
ఉ॥ బాలిక యీపె; మా కొదవెఁ బల్కులఁ గొం; కదిభీరు; మాయెదన్
వాలెడు భీతి; యున్నతఘనస్తన యాపె; శ్రమంబు మాకు; ను
ద్వేలనితంబ యా జలదవేణి; చలింపఁగలేము మేము; హా
యాలలితాంగి దోషముల నబ్బుర మేమటు లౌట కారయన్ 102
50
మధ్యమధీరాధీరనాయిక యొక్క ప్రసాదపర్యవసాయి యైన యీర్ష్యా విప్రలంభము.
చ॥ చలము మఱేయుపాయముల జాఱక, నేఁ జరణాబ్జపాళి ని
చ్చలముగ వ్రాలినంతటన, జాఱినఁ జెక్కిటఁ జేయిఁ జేర్చి, యీ
కలికి నిజప్రసాదము ప్రకాశముగా నెఱిఁగించెఁ బక్ష్మని
శ్చలధృతముక్త కర్కశ కుచస్థల కర్ణదృగంబుధారలన్ 55
51
ప్రగల్భధీరనాయికను అనునయించే కొఱకు.
చ॥ దరహసితంబు తోడ దవుదవ్వుల నిట్లెదురేఁగుదెంచినన్
శిరసున నాజ్ఞఁగైకొనిన నేఁ బలికించిన మాఱు పల్కినన్
దిరముగ నీ చలంబుఁ గని నిష్ఠురతాత్త నిగూఢ కోపపుం
జ రచిత కృత్యమే యిది నిజంబనిన నా మదిఁ దాపమొందెడున్ 56
52
నాయకుఁడు కుపితయైన నాయికను చతురవచనాలచేత ననునయిస్తున్నాడు.
చ॥ చెదరఁగఁ జేసెఁ బత్రములఁ జెక్కిటఁ జేర్చినకేలుదమ్మి యిం
పొదవు రదచ్ఛదామృతము నూరుపుఁ దెమ్మెర లానె బాష్పముల్
కదలఁగఁ జేసెఁ జన్నుఁగవ కంఠనిరుద్ధము లౌట నైనకి
న్క దయితుడా! మాయె నీకు, నటు గామిటు మే మనువృత్తిఁ జేసియున్ 85
53
ప్రగల్భ ధీరాధీర ఖండితనాయిక సాపరాధుఁడైన నాయకునిఁ గూర్చి పలుకుచున్నది.
ఉ॥ నేరముఁ జేసి లేదనెదు నీవును, నట్లగుఁ గాక నేము, ము
న్నారసినట్టివే యివి, వృథాలపనంబుల నేమి కార్య? మే
నేరము లేదు పొమ్ము, విధి నిక్కము వక్రము, నాకు నట్టి నీ
కూరిమి యిట్టులైన నిఁకఁ గుచ్చితజీవనమేల కోరఁగన్? 28
54
ప్రగల్భధీరాధీరనాయిక సాపరాధుఁ డైన నాయకుని సాభిప్రాయముగ వక్రోక్తులచేతఁ బలుకుచున్నది.
చ॥ కినుక యటన్న బొమ్మముడి, కేవలమౌ కలహంబు మౌనమే,
యనునయమెల్ల నవ్వుటయ, యల్కలు దీరుట మోముచూచుటల్,
మనమరియాద; యిప్పటిక్రమంబును గంటివె పాదపీఠిచెం
తనె పొరలాడె దీ వలుక తాళదు దంటకు నాకు నేమియున్ 33
55
నాయకునియొక్క యపరాధాతిశయోక్తిచేత నిర్ష్యాపరాకాష్ఠను బొందిన నాయికను గోపము మానుమని సఖులంటే నాయికపేరలుక ననేమాట.
చ॥ నెలఁతుక కాంతుతో నలుగ నేఁడుమొదల్ శఠుఁడై విషాకృతిన్
మెలఁగెడు వానిపేరయిన నే నొడువన్ మఱి యిట్టు లాతనిన్
గలయక వేగు నాకు నిఁకఁ గల్గదె శారదచంద్రచంద్రికో
జ్జ్వలయగు రాత్రియైన ఘనసంవృతమౌదినమైనఁ గారునన్ 72