పుట:Srivemanayogijiv00unknsher.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్యములను మాత్రమే కాక భావైక్యము జెందినవి కూడ పెక్కులు గలవు. మొత్తముమీద నిట్టి వీగ్రంథమున దాదాపు వేయిపద్యములవఱ కున్నవి. ఇట్టు లీగ్రంథము మొదట శతకమనబడి, క్రమముగా కొన్నినూఱులై వ్రాయసకాండ్రచేత, గవులచేత, కవులచేత జిక్కి ముద్రణయంత్రాధికారుల పాలబడి "ఇంతిం తై వటు డింత యై మఱియు దా నింతై" యన్నట్టులు రెండువేలు మూడువేలు నాల్గువేలు అయిదువేలు వఱకు పెఱిగి నభోవీథినంటుచున్నయది.

పద్యములలో చాలవఱకు తత్త్వమార్గమును గంభీరభావముతో బోధించుచున్నందున, పండితులమాట నటుండనిత్తము పామరులకుమాత్రము బొత్తుగా తెలియుట లేదు. వీనులకింపగు నీపద్యముల యర్థము దెలిసికొనినచో మానసములకు గూడ నింపుగలుగును గదా! కావుననే ఈవిషయమును గుఱ్తెఱింగినవారును చిరకాలమునుండి వంశానుక్రమముగా పెక్కుల సంస్కృతాంధ్ర గ్రంథములను చక్కగ నచ్చొత్తించి యాంధ్ర దేశమునకు మహోపకారమును చేయుచున్న శ్రీ వావిళ్ల. రామస్వామి శాస్త్రులు అండ్‌సన్స్‌వారు వేమనపద్యములకు సులభశైలిలో తాత్పర్యమును వ్రాయించుచున్నారు. కావున బ్రస్తుతము "ఈ వేమనపద్యములకు