పుట:Srivemanayogijiv00unknsher.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూరితములగు పద్యముల నడుమ తమతమ యిష్టము వచ్చినట్టులు చార్వాకమతావలంబకులై నిందాదుల భోధించు పద్యముల జేర్చిరి. ఇక తక్కినవారు మనమేల యూఱక యుండవలయు ననియొ యేమొకాని "తెలిసీ తెలియని మిట్టవేదాంతపు గుట్టలను" చేర్చి పైవారికి తోడ్పడిరి.

లోకము సాధారణముగా గతానుగతికము. ఇట్టులు ఈమన వేమన శతకమున నితరుల స్వకపోల కల్పితముగా గాని యితర గ్రంథములలో నుండి ఎత్తి కూర్చిరి అని గాని యనినచో నమ్మకపోవచ్చును, కావున నట్టివాని కొకటిరెండింటి నుదాహరణముల నీక్రింద బొందుపఱచుచున్నాడను. భద్రభూపాలుడని నామాంతరముగల బద్దెనరేంద్రునిచే రచింపబడి మనపల్లెటూళ్లలో మొన్నమొన్నటి వఱకు పిల్లలచే గంఠపాఠము చేయింపబడుచున్నట్టి సుమతిశతకములో:-

         "గడనగలమగని జూచిన
         నడుగులకును మడుగు లిడుదు రతివలు తమలో,
         గడనుడుగు మగని జూచిన
         నడపీనుగ వచ్చెననుచు నగుదురు సుమతీ."

అని కలదు.

ఈపద్యమును వేమన గ్రంథములో---