పుట:Srivemanayogijiv00unknsher.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖేదమునొందకుము, మోదమునొందుము, ఆగ్రహింపకుము, అనుగ్రహింపుము, శపింపకుము, దీవింపుము, నన్ను నీశిష్యునిగా బరిగ్రహింపుము "దాసుని తప్పులు దండముతోసరి' యనెడిమాట కర్థమును కలుగ జేయుము" అనిదీనదీనుడై దయారసము చిప్పల నమేయవాగ్వైఖరిని యఖండజ్ఞానరూపియై వేమన మఱల పలికెను.

అభిరాముడు "అయ్య! మీవలన నిసుమంతయును దొసగులేదు. 'దరిద్రుడు తల గడుగగా వడిగండ్లవాన కురిసె' నన్నట్టులు నాదురదృష్టముచేత యట్లు జఱిగినదే గాని వేఱుగాదు. బ్రహ్మ మనుజుని ముఖమున నెన్నిబంతులు ఎన్నియక్షరములను వ్రాసెనో అన్నియును వ్యర్థములు కావు. నేనదృష్టహీనుడను కనుక నాకు దగిన ఫలము లభించినది. మీరు అదృష్ట శాలురు గనుక ఆయోగి చరమావస్థలో బ్రహ్మవిద్యోపదేశమును బడయగలుగుట సిద్ధించినయది. వేయిజన్మములనైన నార్జింప వలనుపడని పరమాత్మసాధకమగు బ్రహ్మవిద్య అనాయాసముగా నొకనిమిషములో సిద్ధించుటకంటె యదృష్ట మేమి కావలయును. దీనికెవ్వ డధికారియో? ఏది యెవ్వని సొత్తో అదివానిదగునే కాని ఇతరుని దగునా ? కావున చింతనొందకుడు నాకుమీపైని ఇసు