పుట:Srivemanayogijiv00unknsher.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యట్టులు మంగళాష్టకములు బఠించి వెడలిపోయెను. అభిరాము డెప్పటియట్టుల వానినన్నిటిని శాంతుడై విని యూఱకయుండెను. వేమన యిప్పుడీ వెళ్లుట నేఱుగా తమవదినెగారియొద్ద కేగి యామె కాళ్లపై వ్రాలెను. ఆమెదీవించి లెమ్మని యాతని బలికెను. "అమ్మా నీవు మాతృసమానవు, నామనవి యొక్కటి యున్నది దానిని నీవు తీర్పవలయును. బిడ్డలకోర్కుల దీఱ్పని తల్లులు గూడనుందురా? నీవు నేను కోరినట్లు చేసెదనని చెప్పిననే మీకాళ్లనుండి లేచెదను. లేకున్నలేవను కాన చేసెదనని చెప్పు"మనియెను. ఆమెయు నట్లేయని పల్కెను. 'రేపటి యుదయమున సూర్యుడుదయింపకమున్నె అభిరామయ్యదుకాణములోనికివచ్చి రెండుజాములవఱకు పనిచేయునట్లు మాయన్నగారిచేత నాజ్ఞ యిప్పింపవలయును.' అనివేమన్న కోరెను. "నాయనా? బీదవాడభిరాముడు సాధువుకూడను వానికి మిక్కిలి మనస్సునొచ్చునట్టులు చేయకూడదు నీవు ప్రతిదినమును నాతని త్వరపెట్టుచున్నందుకే యాతని కింతవఱకు నొచ్చియుండును, అయినను దానివలన నీకు కలుగుఫలము జెప్పుము చేయించెద"నని పల్కు వదినెగారి మాటల కడ్డమై వేమన్న "నాయుపయోగమును తఱువాత జెప్పుదును" అని పల్కి ఆమెవలన వాగ్దానమును తీసికొని వెడలిపో