పుట:Srivemanayogijiv00unknsher.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైనివేసికొనిన దంభగుణప్రధానులగు కొందఱిలో జేర్పదగినవాడు కాడు. అతడు ప్రతిదినమును నగరి వారిసొమ్ములను జేయుటకు నియతముగా సూర్యోదయమునకు రావలసియుండెను. 'కాని జాముప్రొద్దెక్కునప్పటికి కర్మశాలకు వచ్చి చేరుచుండెను. ఆతని తమ్ముడగు లక్ష్మయ్య మాత్రము ముందఱగా చనుదెంచి పనిని చేయుచు "అభిరామయ్య యేడి?" యని తన్నధికారులడిగిన యెడల 'ఈపాటికి వచ్చుచుండును, స్నానమును జేయుచున్నాడు.' అని ఏవో కొన్ని కారణములను వారి మనంబులకు నచ్చునట్లు చెప్పి తనసౌభ్రాతమును వెల్లడించుచుండెడివాడు.

ఇట్లు జఱుగుచుండ మన వేమనగారి కార్యదర్శిత్వము ప్రారంభమైనది మొదలుకొని యభిరామునిపై పూర్వముకన్న మిన్నగా నధికారశకట మితరుల ప్రోత్సాహము లేకయే పఱుగిడ నారంభించెను. 'ప్రతిదినమును ఆలస్యమేనా? పోనీ! ఒక్కరోజు కదాయని చూచినకొలదిని యధికమగుచున్నది ఇట్లయిన నోర్చుటలేదు జాగ్రత్తగా వచ్చుచుండుము' అనియొకదినమున వేమన కోపారుణితవదనుడై పల్కెను. అభిరాముడందులకు మనంబులో చాల కష్టమునొంది 'చిత్తముచిత్త'మని మాఱుపల్కెను. అవశజీవిక గలవార లింతకంటె నెక్కువ నేమని చెప్పగలరు? ఆరోజు గడచినది. మఱుసటి దినము