పుట:Srivemanayogijiv00unknsher.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెదకించి యెచ్చటను గానక యింటిలోవెదకి యొక గదిలో నొంటరిగాముసుగు నిడికొని పరుండిన వేమన్నను లేపి తోడుకొని పోయి భుజింప జేసెను. ఆదినము మొదలుకొని వేమన వేశ్యయింటికి బోవుట మానుకొని యుండుట నెఱింగి నరసాంబగారు మఱల మఱదిని విషయములవంక ద్రిప్పి గృహస్థధర్మావలంబినిగాచేయ దలంచి వేమన్నకు "మీయన్నగారు నాకుకొన్నినగలను చేయింప బూనుకొనియున్నారు. వానిని మననగరిలో కుందనపు పనివాండ్రగు నభిరామయ్య లక్ష్మయ్య యను గంసాలురు చేయుటకు ప్రతిదినమును వచ్చుచుందురు. నీవు ఊఱకయే యుందువు గనుక బంగారము పాఱుపొకుండ నచ్చటనుండి పనిచేయింపవలయును" అని యాజ్ఞ నిచ్చెను. వేమన్న యును అట్లేయని తమవదినె చెప్పిన చొప్పున ప్రతిదినమును కుందనపు మందిరమునకు బోయి కూర్చుని వారు చేయునగలు బంగారము మొదలగువానిని జాగ్రత్తతో బీఱువోకుండ కనిపెటుచుండెను.

అభిరామయ్య కథ.

కులముచే కంసాలియయ్యును అభిరామయ్య మంచి యాచారసంపన్నుడు నిహపరములపై శ్రద్ధకలవాడును కృతజ్ఞుడును విశ్వాసోచితుడగు పనివాడునై యుండెనేకాని ఇటీవలివారివలె లేనిపోని పిచ్చివేషముల