పుట:Srivemanayogijiv00unknsher.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాచేసెదనని వేమన్న మాఱుపల్కెను. అదియును "మీవదినెగారు అగు నరసాంబారాణిగారు ధరించెడి యాభరణములన్నియు నాకు గావలయును నేను వానిని ధరించుకొందును మీరు నానందము నొంద్రెదరు. తెచ్చిఈయుం"డనె నట. వేమన్నయువల్లెయని వెడలిపోయి తనవదినెగారి నడిగెనట. సకలసద్గుణని కురుంబయగు నానరసాంబ మఱది మాటలను విని ఎట్లైనను విషయలంపటత్వము నీతనికి బోగొట్ట తలచి తన ముక్కుననున్న బులాకి తప్ప తక్కినసొమ్ముల నన్నిటి నిచ్చెను. వేమన్న సంతుష్టుడై వాటిని గొనిపోయి వేశ్యకిచ్చెను. అదియును నానగలతో నలంకరించికొని బులాకీలేకుండుట గని అదికావలయునని పట్టుపట్టెనట. ఆపల్కులను విని వేమన్న వేశ్యయం దించుకఱోసి మోహపాశమును త్రెంపలేక ప్రయత్నించెదనని కోటలోనికి జని వదినెగారిని యడుగ నోరురాక చింతతోపరుండి యుండగా నీవృత్తాంతము నెట్టులో దాసీలవలనవిని నరసాంబారాణి గారు స్వయముగా వచ్చి 'యేమి నాయనా! విచారముతో నున్నట్లున్నది' అనియడిగెను. వేమన్నయును తనవిషయలంపటతను నిందించికొని యున్నదున్నట్టులు చెప్పెను. ఆమెయు నాతడొక్కించుక దారిలోనికి వచ్చియుండుటను కనుగొని విషయములపై రోతపుట్టింపదగు సమయమిదియే యగు ననుకొని ఈ