పుట:Srivemanayogijiv00unknsher.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొడవుగల రెండుబంగరువిగ్రహము లచ్చట మెఱయుచుండెను. వాడును ఏరికి దెలియనీక తాను రహస్యముగా వానినింటికి గొనితెచ్చి దారిద్ర్యకారణమున దినముల పేరిట ఆబంగారు విగ్రహముల కాళ్ళు వ్రేళ్లు చేతులు మొదలగు నవయములను తెగనఱికి అమ్ముకొనుచుండ నెట్లోతెలిసికొని మనయనపోత వేమారెడ్డిగారు "రత్నహారీతుపార్థివ:" యనున్యాయానుసారియై వానిని బొక్కసము జేర్పించెకొనెనట, ఈయన తఱువాత మనశ్రీనాథాదికవికల్పకముల కాలవాల మగుననవేమారెడ్డి కొంతకాలమును ఈతనికుమారుడు కొమరిగిరి వేమన్న కొంతకాలమును రాజ్యము బాలించిరి. అప్పటినుండి యనగా కోమటివేమన్నను చంపినప్పటనుండి వెల్లడిగా నతని పెద్దకొమారునకు కోమటివెంకారెడ్డి యనిపే రుంపబడియెనట.

వేమనయోగి వెలయాలిపై రోయుట.

ఈకోమటి వెంకా రెడ్డియును మన వేమన యోగియును నన్నదమ్ములు. వెంకారెడ్డిగారు రాజ్యపాలనము జేసి చన్నరాజులకంటె మిన్నయనియును, ప్రజాపక్షపాతి యనియును ధర్మస్వరూపుడనియును బేరుగాంచినవాడు. ఈయన కొంచెమించుగా బదుమూడవ శతాబ్దాంతమున సింహాసనాసీనుడై 14 శతాబ్దమున, ప్రథమభాగమున నుత్తమలోక సాయు