పుట:Srivemanayogijiv00unknsher.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననుమకొండ నేవోకొన్ని కారణములచే వదలి కొండవీడున నుండి కాలధర్మము నొందెను. అటుపిమ్మట పుల్లయవేమారెడ్డి స్వతంత్రుడై కొండవీడునకధిపతియై పల్నాడు సీమలోని కొంతభాగము నాక్రమించికొనియెను. ఈయన చాల ధర్మాత్ముడట. 108 శివాలయములను గట్టించి నిత్యనై వేద్యదీపారాధనల నేర్పఱచెనట. షుమారు 12 సంవత్సరములు రాజ్యముజేసి కైవల్యము జేరెను. ఇతనికి అనపోతవేమారెడ్డి యని తమ్ము డొకడుండెను. పుల్లయవేమారెడ్డి తఱువాత నీయన రాజ్యమున కధిపతియై వృద్ధినొందించి కొండపల్లిలో కోటనుకట్టించినట్లును, కొండవీడు, అద్దంకి రాయచూరులను గూడ పరిపాలించి నట్లు గూడ అమరేశ్వరములోని యొక శాసనమువలన తేలుచున్నది. అనపోతవేమారెడ్డి పరిపాలన కాలమున గూడ నొక చిత్రకథ జరిగినదని జనులవాడుక.

2. అనపోత వేమారెడ్డిని గూర్చిన కథ.

ఈయన పోతవేమారెడ్డి ప్రభుత్వము చేయుకాలమునందు కొండవీటికొండపైని నొకగోసాయి నియతాత్ముడై యుండెను. ఆతనికి ప్రతిదినమును నొకగొల్లడు పాలగొనిపోయి సమర్పించు చుండెడివాడట. ఒక రోజు గోసాయి చాలదయగలవాని వలె యాగొల్లవాని చేర బిలిచి "దినమును నా కెందులకు బాలనిచ్చు