Jump to content

పుట:Srivemanayogijiv00unknsher.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యచ్చటబరుండుట కనుజ్ఞనొంది పసులకొట్టములో కావడిదింపి భోజనము సేయ జేరువనున్న నొకపూట కూటింటికి బోయెనట. ఇంతలో అలియరెడ్డి పసుల కొట్టమునకు వచ్చి తళతళ మెఱయుచుండుటను కనుగొని పరిశీలించి పరస వేదియని తెలిసికొని ఆకుండలను జాగ్రత్తజేయించి కోమటి వచ్చులోపల కొట్టమునకు నిప్పంటించెనట. తఱువాత కోమటి భోజనముచేసి వచ్చి కొట్టము ముట్టికొని మండుచుండుటను చూచి నిర్భాగ్యుడనగు నాకు పరసవేది యంటునా? యని విచారపడుచు దానిపై యాసను వదలుకొనలేక యామంటలో బడి మడిసెనట. ఆపిమ్మట కోమటి పిశాచమై పీడలు చేయుండ నళియరెడ్డి మ్రొక్కులు మ్రొక్కికొని ముడుపులు కట్టుకొని అతనిరూపమును బంగారు ప్రతిమను చేసి పూజించి యెట్టకేలకు ఆపిశాచపుకోమటిని తృప్తినొందించి ఇకమీద తనకుగల బిడ్డలకందఱికి వేమన్న పేరు బెట్టెద నని ప్రస్తుతమున తనకొడు కగు పుల్లారెడ్డికి పుల్లయ వేమారెడ్డి యనిపేరు పెట్టెనట. కథముగిసినది. ఇది వేమనవంశమునకు మూలపురుషుడగు నలియరెడ్డిని గుఱించినది. వేమనవంశీయులు ధనికులు అని చెప్పుటకో ఏమొ? అలియరెడ్డిపై నిట్టికథ కల్పితమైనది.

ఆదొంతి అలియరెడ్డి 1323 వ సంవత్సర ప్రాంతమున