గ్రంథకరణమునకు కారణములుగా చెప్పెడివానిలోనివి. చక్క జేసి వాస్తవములను నభిప్రాయముచేత కాకపోయినను చదువరుల కొకవిధమగు నానందమును కొలుపగలవను నూహతో నొకటిరెండింటిని ఈక్రిందపాఠకుల కుపాయనములనుగా చేయుచున్నాను. వేమనపద్యములను గూర్చి కవితావిషయమును గూర్చి "ముద్దులు మూటగట్టెడి మధురశైలితో నింపుగారచన జేయబడినది" అనుటకంటె ఎక్కువచెప్ప బనిలేదుగదా!
1 - వ కథ.
ఆంధ్రదేశమును పదునాల్గవ శతాబ్దమునుండి పదునైదవశతాబ్దమువఱకు రెడ్లు పాలించియుండి రనుట చర్విత చర్వణము. అట్లు పాలించినవారిలో కొందఱద్దంకిని ప్రధాననగరమునుగా జేసికొనియును, నిక గొందఱు కొండ వీడును ముఖ్యపట్టణముగా జేసి కొనియును మఱియు గొందఱు రాజమహేంద్రనగరమును రాజధానినిగా జేసికొనియును త్రిలింగ దేశమును పరిపాలించుచు వచ్చుచుండిరి. ఇట్టి రెడ్డి వంశమునందు జనించిన మనవేమనకు మొదటిపేరు వేమారెడ్డిగారు. ఈయన కొండవీటిసీమ కధిపతియగు కొమరగిరి వేమారెడ్డి ప్రభువుల కొమరుడు. ఈయనజనని మల్లమ్మారాణిగారు. ఈయన తండ్రికి మూడవకొమరుడు. ఇతని పెద్దయన్న పేరు కోమటి