పుట:Srinadhakavi-Jeevithamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

శ్రీనాథకవి


రాజమహేంద్రపుర రాజ్యమునకుఁ గూడఁ దానే హక్కు దారుఁడనని పెద కోమటి వేమా రెడ్డి ప్రకటించియుండును. ఏతత్కారణమువల బెదకోమటి వేమూ రెడ్డికిని, కాటయ వేమా రెడ్డికిని మనస్పర్ధలు పుట్టియుండును. కాటయవేమారెడ్డి పక్షమున నన వేమారెడ్డి మనుమరాలి పెనిమిటియైన అల్లాడ రెడ్డి రాజమహేంద్రపుర పాలకుడుగా నుండి కాటయ వేమారెడ్డి పక్షమననుండి రాజమహేంద్రపురము పెదకోమటి వేమా రెడ్డికి స్వాధీ నముగాకుండఁ జేసెను. "కానీ కుమారగిరి రెడ్డి కొడుకయిన యనపోత రెడ్డిని జంసి 'పెదకోమటి వేనూ రెడ్డి యన్యాయముగాఁ గొండవీటి సామ్రాజ్య మాక్ర మించి నాడని నేనూహింపజాలను, ఏమయిననగుఁగాక కొండవీటిసామాజ్యము కుమారగిరి మరణముతో 'రెండుగాఁజీలిపోయినదనుట వాస్తవము. కాటయ వేమా రెడ్డియుఁ బెదకోమటి వేమా రెడ్డియు గూడ సమర్థులును, విద్వాంసులును, బలనంతులు నై యుండుటచేత రెండు రాజ్యములును మఱి కొంతకాలము స్థిరపడియుండుట కవకాశము గలిగినది.పెదకోమటి వేమా రెడ్డి రాజ్యపరిపాలన ప్రారంభకాలమున నాతనికి గొన్ని చిక్కులు గలిగియున్నట్టుగా నీ క్రింది చాటువువలన గూడ నూహింపఁదగును.


సీ. ఆ చెలపనుద్దండ (P) అన వేమ పురమను
గ్రామంబు తోరణకట్టిరేని
ధరణీకోటనుగల్గు ధన ధాన్య వస్తువు
లరికట్టుకొని చూఱలాడిరేని
మునుకొనీ యభిమాన ముద్ద భక్షింపుగ
సారెకుఁ జేతులు సాచి లేని
అభ్యంగనము సేయు నన్న గారికిఁ దెచ్చు
మానెలో జేతులు మాటి రేని

కణగి శత్రులు చేయుసఖాత్యమునకు
నోర్చియుంటివి నీ సొటియుర్విగలఁడే
సమదరపు వీర ! రాయ వేశ్యా భుజంగ!
అతులబలభీమ! " పెదకోమటన్న వేమ