పుట:Srinadhakavi-Jeevithamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

91



భూమిపతే! కుమారో వీరాన్న పోతన్మపతిః' అన్న వాఖ్యము మాత్రము గన్పట్టుచున్నందున వీరుఁడైన యనపోత రెడ్డి యను కుమారుఁడున్నటులు గన్పట్టుచున్నది. కుమారగిరి రెడ్డి మరణానంతరము వీరి కుమారుఁ డైన యనపోత రెడ్డి రాజ్యమును బొంద వలసినవాడై యుండఁగా బెదకోమటి వేమూ రెడ్డి రాజ్యమాక్రమించుకొని పరిపాలనము చేసినట్లు గానంబడుచున్నది. వీరాన్న పోతనృపతి:, అనుటచేత నితఁడు కేవలము బాలుఁడుగా నుండువాడు గాక వీరుడనియు, నృపతియనియు, బ్రస్తావిం పఁబడియున్నాఁడు. కావున నితఁడే మొదట రాజ్యమును బొందియుండును. కాని సామ్రాజ్య మీతనికి నిలిచియుండ లేదు. రాజ్యము పెదకోమటి వేమారెడ్డి పాలయ్యెను. ఇతఁడు బలాత్కారముగా రాజ్యమాక్ర మీంచుకొనుటకుఁ దగిన హేతువు గాన రాదు. కుమారాన్న పోత రెడ్డి యెవరితోడనై న యుద్దములోనో మరణముఁ జెంది యుండవలయును. అట్టియుద్దము రాచకొండ రాజ్యుధీశులగు పద్మనాయక వెలమదొరల తోడ ధరణి కోట సమిపమున జరిగి యుండ వలయును. ఆయుద్ధములో గుమా రాన్న పోత రెడ్డి మృతినొందఁగాఁ గొండవీటి రాజ్యము కాటయవేమారెడ్జి యూక్రమించునేమో యన్న భయముచేత ప్రోలయ వేమూరెడ్డి యన్న యగు మాచారెడ్డి మనుషుఁడు పెదకోమటి వేమా రెడ్డి, దండనాయ కులును, నియోగి ప్రముఖులున్న మామిడి వేమనానూత్యుఁడు, పెగ డనామాత్యుఁడు, సింగనామాత్యుడు మొదలగువారి తోడ్పాటున నాక్రమించుకొని యుండును.ఏతత్కారణము మూలమునఁ గాటయ వేమారెడ్డి రాజమహేంద్రపుర రాజ్యమును స్వతంత్ర రాజ్యముగా బ్రకటించి యుండును. ఈ రాజ్యమును కుమారగిరి రెడ్డి తనకిచ్చినవాడని చెప్పిన విషయ మప్పటి నుండి చెప్పుకోనుట తటస్థమగుటచేత కాటయ వేమా రెడ్డి భార్య మల్లాంబ తొత్త రమూడి శాసనమున నట్లు వ్రాయించి యుం డును. 'రాజమహేంద్రపురము గోండవీటి, సామ్రాజ్యములోనిదే గనుక