పుట:Srinadhakavi-Jeevithamu.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
90
శ్రీనాథ కవి


దీనిగద్యములో నిట్లున్నది

"ఇతి శ్రీ పెదకోమటి వేమభూపాలేన కృతా సప్తశతీ సారటీకా సామాప్తాః"

దీనింబట్టి ప్రభాకరశాస్త్రి గారు సంశయించినట్లు (బహుశః) శ్రీ నాథుఁడు తన సప్తశతిని నాతనికంకితము చేసి యుండవచ్చునని మఱికొం దఱకుఁగూడ దోపవచ్చును. నాయూహ మఱియొక విధముగాఁ బాఱు చున్నది. రసవత్తరమైన శృంగార ప్రబంధమునంకితముఁబొందిన ప్రభు వేవ్వరైనననేమి! అతఁడు తద్గ్రంధరచనమునకుఁ బిమ్మట రాజ్యసంబంధ మునఁ గలిగిన విహాదములలోఁ బేదకోమటి వేమూ రెడ్డికి బ్రతిపక్ష నా యకకోటిలోఁ జేరినవాడగుట చేతనే పెదకోమటి వేమా రెడ్డి వానివలని స్పర్ధచే సప్తశతీ సారటీకను వ్రాయసంకల్పించి యుండుననియు, ప్రెగడ నామాత్యుని ప్రేరేపణము చేసీ కార్యమునందు శ్రీనాథకవి యాతనికి దోడ్పడియాతని మనోరధ మిడేర్చినవాడయి యుండుటచేత నత్యంతాభిమాన ముతోఁ బెదకోమటి వేమారెడ్డి కొండవీటి సామ్రాజ్యాధిపత్యము తనకు స్థిరపడిన తరువాత 1404 లో నమ్మహాకవిని దన సామ్రాజ్యమున విద్యాధికారిగా నియమించి యుండునని నేను విశ్వసించుచున్నాను. విశ్వేశ్వరపండితుఁ డాదిగా గలమహోద్దండ పండితులుండిన యాకాలమున సామాన్యముగా నిరువది నాలు గేండ్ల ప్రాయమువాని నామహా పదవియం దుంచుట సంభవింపదని నాయభి ప్రాయము. ఏ కారణము చేత నైన నేమి తొలుదొల్త విశేషాభిమానముతోడఁ దగ్గిరకుఁ జేర్చుకొని, తనకొల్వు నువిడిచి పెట్టి మరల పోకుండ నట్లాతని మహోన్నత స్థానమునఁగూరు చుండఁ బెట్టు నదృష్ట మాకాలముననొక్క. వేమారెడ్డికి మాత్రమే పట్టినది.

కుమాగిరి రెడ్డి రాజ్యావసానస్థితి.

కుమారగిరి రెడ్డికి వీరాన్నపోత రెడ్డి యను కుమారుఁడున్నట్లు దొజ్" రామమునందలి -మేక శిథిల శాసనములో ' శ్రీమశ్కు కూరగిరి