పుట:Srinadhakavi-Jeevithamu.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
89
చతుర్థాధ్యాయము


ద్దదక్షుడు, బలము విషయములోఁబొగడనర్హుఁడైనవాడు, డండనాధుఁడి తఁడొక్కఁడేయని చెప్పియున్నాడు. అనవేమాధిప రాజ్య భరభరణ వ్యాపార దక్షుఁడయిన పెద్దనామాత్యుని మూవురు పుత్రులయిన వేమ నామాత్యుఁడు ప్రెగడనామాత్యుఁడు, సింగనామాత్యుడునను వారిలో నీతఁడు రెండవవాఁడు. వీని తడ్రియు బినతండులు నన వేముని కాలము వారు గనుక నీతఁడు కొండవీటి సామ్రాజ్యమును బరి పాలించు నన వేముని యన్న కుమారుఁడగు కుమారగిరి రెడ్డి పరిపాలన కాలమున నాసా మ్రాజ్యమున నొకదండనాధుఁడుగ నుండెనని మనము స్పష్టముగాఁ జెప్ప వచ్చును. మరియుఁ గుమారగిరి రెడ్డి తరువాత నాసామ్రాజ్య పరిపాలన మువహించిన పెదకోమటి వేమారెడ్డి పరిపాలనారంభ దశయందు గూ డ దండనాధుఁడుగ నుండి యాకాలము ననే జగిన నే యుద్ధములోనో వీరమ రణమునొందియుండవచ్చును. ఈ ప్రెగడనామాత్యుని ప్రే రేపణముచేత నే మన శ్రీనాథకవి శాలివాహనసప్త శతి' యను రసోత్తర శృంగారప్ర బంధమును రచించియుండును. అయ్య దికుమారగిరి రెడ్డికో, లేక యీపై గడనామాత్యునికో యంకితముగావించి యుండవలయునని యూహిం చుటక వకాశముగలదు. ఎట్లయిన నాగ్రంధము ప్రెగడ నామాత్యుని, పెదకోమటి వేమా రెడ్డిని నాకర్షించినదని చెప్పక తప్పదు. ఎందువల్లన నఁగాఁ "బెదకోమటి వేమారెడ్డి క్రీ. శ.1404 వ సంవత్సరమున నీతనిఁద న సామాజ్యమున విద్యాధికారిగా నియమించెను. శ్రీనాధ విరచితము లైన యారాధ్య చరిత్రమాదిగాఁ బెక్కుకృతులను ప్రెగడ నామాత్యు డంకితమునొందెను. ఇంతియగాక పెదకోమటి వేమా రెడ్డి హాలవిరచిత మైన సప్త శతి యేడునూర్ల గాధలలోను మిక్కిలిసారములయిన వాని నూరుగాధల నేఱి వ్యాఖ్య వ్రాసి సప్త శతీసారటీక వెల్వఱచి యున్నాడు. ఆవ్యాఖ్య ప్రారంభమున: ---


 శ్లో, హాలః ప్రోక్ సప్త సతీం గాధా కోటేర్వధత్త సంప్రతితు
సాయం వేమ నృపాలస్తస్వ అపిశతక మహరత్సారం

12