పుట:Srinadhakavi-Jeevithamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

శ్రీనాథ కవి

మనమునిశ్చయింపవచ్చును. కాని యీగ్రంథ మెవ్వని కంకితమియఁబడి నదో తెలిసికొందమన్న నాగ్రంధ మిప్పుడెచ్చటను గానరాదు. శ్రీనాథునిసప్త శతిలోని యీ క్రింది పద్యము మాత్రమ నేక లక్షణ గ్రంథములలో నుదహరింపఁబడియున్నది.


ఉ. నారణ సేయ దాపన నాశవవారిజమందుఁ దేటిక్రొ
వ్వారుచుకుంటనీ వెఱుగఁవా ప్రియహా తెఱగంటి గంటి కె
వ్వాకిగెలుపు గాదు తగవాదుగ వారల దూఱ నీవిభు
డారసి నీ నిజం బెఱుగు నంతకు వంతను నోర్వు నెచ్చెలీ!


ఇట్టియపరూప మధురకావ్యరచనచే బదునెనిమి దేండ్ల ప్రాయము ననే యీతని కీర్తి దశదిశలవ్యాపించి దేశ దేశములకుబ్రాక నారంభించి నది. ఎండ రెందరో మహా రాజుల యొక్కయు, ఎందఱెందరో మంత్రి పుంగవులయొక్కయు జిత్తముల నాకర్షింపఁగలిగినంతటి ప్రజ్ఞాధురంధ రుఁడయ్యెను. మనశ్రీనాధకవి పుంగవుఁడు.

ఆర్యాధ్య చరిత్రము --- ప్రెగడనామాత్యుఁడు

శ్రీనాధకవి శాలివాహనసప్తశతికి వెనుక నారాథ్యచరితము మొదలగు పెక్కు కృతులను రచించి ప్రెగడనామాత్యుని కంకితము చేసి యున్నట్టుగా శృంగారనైషథములోనిఁ జగమునుతింపఁగఁ జెప్పితి, యను పథ్యమువలనఁ దెలియుచున్నదని యాపద్యము నిదివఱకె యుదాహ రించినాఁడను. ఈ ప్రెగడనామాత్యుఁ డెవ్వఁడు. ఇతఁడు శృంగార నైష ధకృతి పతియగు సింగనామాత్యుని యన్నయని యిదినఱ కెఱిఁగితిమి, ఇతఁడేయుద్యోగమునందుండెనో యావివరముగూడ నాగ్రంథముననీ క్రింది పద్యములో సూచింప బడినది.

 మ. తగుఁ గైవార మొనర్ప విక్రయకళాదౌరేయతాసాలిశ్రీ శాలిశ్రీ
ప్రెగడన్న ధ్వజినీశుఁడం బునిధి గంభీరుడు శుంభద్ద్విష
న్నగర ద్వారకవాటనవిధాన ప్రౌడ బాహార్గళా
యుగళుం డాహవ సవ్యసాచి ధరలో నొక్కండు. పేరుక్కున న్.

,

అనిపరాక్రమవంతుఁడు, గంభీరుడు, శత్రు పుర భేద కుఁడు.. 'యు