పుట:Srinadhakavi-Jeevithamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథ కవి


నకువిచ్చేయు భాగ్యము దొలఁగిపోయినది. కుమారగిరి రెడ్డి పరిపాలనము ముగి యువఱకు శ్రీనాథునకు నిరువ దేండ్లకు మించిన ప్రాయము లేదు. పెద్ద కోమటి మరణానంతరము శ్రీనాధుఁడు కాంచీనగరమునకుఁబోయి అప్ప య సెట్టీని సందర్శించినప్పుడు 'బాలసఖుం' డని ప్రశంసించుట యెంత స్వాభావికముగా సమంజసముగాఁ గన్పట్టుచున్నదో వేఱగ నొక్కి వ క్కాణింపనలయునా? కొదువవిషయములు హరవిలాసక రచనా ప్రశంస సందర్భమున విస్తరింపఁ దలఁచి యిచ్చట విరమించుచున్నాను,

శ్రీనాథకవికిఁ గొండవీ డెస్పటినుండి నివాసముగనుండి యుండెనో చెప్పుటకుఁ గాని యూహించుటకుఁగాని యాధార మేమియుఁగాన రాదు. అవచితిప్పయ సెట్టివలెనె ప్రతిసంనత్సర వసంతోత్సవములకు వచ్చుచుఁ బోవుచుండెడి వాడని ప్రభాకర శాస్త్రి గారూహించిన దాని కాధారమేమియు వారు చూపింపరయిరి, పదునై దేండ్ల ప్రాయనుననే శ్రీనాథును;

చ. అవనిపుడాదరించిన భటాళి భటత్వము వైద్యు వైద్యమున్
గవికవితామహాత్వమును గాయకు గానముఁ గోటి సేయున
య్యవలపు గాదరింపని భటాళి భటత్వము వైద్యు వైద్యము
గవిక వితామహత్త్వమును గాయనీ గానము గవ్వ సేయు నే,

అన్నట్టును, రాజాశ్రయము లేక యశోధనములు సమకూఱ నేర పని యాకాలమునఁ "బెనుపుగల్గి రాజ్య మేలుచున్న స్వదేశ ప్రభువులగు 'రెడ్ల ప్రొఫునకై యప్పుడు రాజధానిగా నున్న కొండవీడుచేరి రెడ్లమం త్రులును గార్యనిర్వాహకులు నగు నియోగి ప్రమఖుల యాదర గౌరవ ములు వడయఁజొచ్చి తర్వాత రెడ్లయాస్థానమున విద్వత్కవి యయ్యెనని ప్రభాకరశాస్త్రి గారు వ్రాయుట, పిచ్చ కుదిరినది రోకలి తలకుఁ జట్టు మన్నట్టున్నది. శ్రీనాధుని జన్మకాలము 1385 అని మామిత్రు లగు. శాస్త్రీగారు నిర్ధారణ చేసియున్నారు. పదునై దేండ్ల ప్రాయమున,అనగా 1400 సంవత్సరమున శ్రీనాథుఁడు . రాజాశ్రయముకోఱకు కొండ