పుట:Srinadhakavi-Jeevithamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దియు రెండవదియు సత్యములు గావు. అని వేమ రెడ్డి సింగనమాధవేంద్రు నకు సమకాలికుఁడుఁ, సింగనమాధ వేంద్రుని మునిమనుమఁడగు లింగము నాయుఁ 'డెట్లు అన వేముని సంహరించి సింహతలాట బిరుదము నొందెనో యూహింపనలవిగాదు. అన వేను రెడ్డి వెలుగోటి వారివంశ చరిత్రములో పక్కాణింప బడినట్లు అనపోత నాయునివలనఁగాని లింగమనాయుని . వలనఁగాని సంహరింపఁబడె ననుట విశ్వసనీయముగాదని రూఢిగఁ జెప్ప వచ్చును. శృంగార నై షధ కృతిపతియగు మామిడి సింగనామాత్యుని తండ్రి 'పెద్దనామాత్యుం డీయన వేమారెడ్డికి ముఖ్యమంత్రిగ నుండెనని శ్రీ నాథుని శృంగార నైషధములో : : ---

అని నారాతి వసుంధ రారమణ సస్తంగా పహారక్రియా
ఘనసంగం భ విబృంభ మాణ పటుపో: ఖర్జూర ద్వితీయార్జ నుం
డన వేమాధిపు రాజ్యభారణ వ్యాపార దక్షుండు "పే
ద్దన మంత్రీశుడు మామిడన్నన్న సుతుఁదేతన్మాతుండే యెన్నగన్ .

అను పద్యమువలనఁ దేటపడుచున్నది.

ఈయమాత్య శేఖరునకు వీరభద్రామాత్యుఁడ', మారనామా
త్యుఁడు నామామాత్యుఁడునను ప్రసిద్ధులైన మూవురు తమ్ములు వివిధ
కార్యశరణదక్షులై మంత్రులై యన్నకు విధేయులై యొక్కోక్కం
డొక్కక విషయంబునఁబ్రజ్ఞాడ్యులై యుండిరని నైషధములోని !
కిందిపద్యములలో "దెల్ల ము చేయఁబడియెను.

ఉ. 'హేమథరాధ రేంద్రమున కొంతటి పెద్దధృతిక భుజంగమ
స్వామికి మేలు చేయు పటుగా గ్విభవంబున బుద్ధిసంపదల్"
దామరచూలికిన్నరి ప్రధానులు దక్కినవారు సాటీయే
మామిడి వీరభద్రువ కసూత్య శిఖామణికివ్వసుంధరన్"

సత్యవ లో నిరూఢుఁడు నిశాకర భక్తి భావనా
సౌత్యన తేయుఁ డుచ్చట భుజబల విక్ర మ కేళీ విక్రమా
దిత్యుఁడు కావ్యఖడ్గ సముర్ణుఁడు మామిడి మంత్రి మారనా
మాత్యుఁడు వానిఁ బోలవశమా ధరణీధవ మంత్రికోటికిన్ "