పుట:Srinadhakavi-Jeevithamu.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
74
శ్రీనాథ కవి


శ శ. 1283 ప్లవ సంవత్సర శ్రావణపంచమి గురువారమునాఁడు ఆన పోతయ రెడ్డి గారికి ఆయురారో గ్యైశ్యర్యాభివృద్ధి కోఱకును ధనకనక వస్తు నాహన సమృద్ధి కొఱకును, పుత్ర పౌత్రా భివృద్ధి కోఱకును పునః ప్రతిష్ఠా పనము గావించెనని యాశాసనము చాటుచున్నది. అనపోతభూపాలుని రాజ్య పరిపాలనాశాలమున జరిగిన మహద్విషయ మొండు సముద్రతీరమునందున్న మోటుపల్లి పురాతన కాలమునండియు వర్తక స్థానమై నౌకావ్యాపారము నకుఁబ్రధానస్థానముగా నుండెను.. కాకతీ యసామ్రాజ్య మస్తమించిన 'వెనుక మోటుపల్లీయం దుండెడు వర్తకులు పరస్థలమలకుఁ బోవుటయు వ్యాపారము తగ్గుటయఁ డటస్థించెను. అనపోత రెడ్డి యీరేవుపట్టణమును వృద్ధికిఁ దీసికొని రావలముసని శ్రద్ధతో సంకల్పించేను. అనపోత రెడ్డి యూజ్ఞాపకారము వాని పుత్రులలో నొక్కఁడగు మోట పల్లి నగరాధీశుఁడు సోమయామాత్యుఁడు,

మోటుపల్లి 'కే వర్తకుకులు వచ్చి నివసింపగోరినను వారిని గౌర వించి వారలకు భూములు నివేశనస్థలములు సిప్పింతుమనియు, వారలు స్థలమునకుఁ బోఁదలచుకొన్నప్పుడు వారిని నిర్భంద పెట్టి నిలుపక స్వేచ్ఛగా విడుతు మనియు, ఏయూరినుకు తెచ్చిన నూ, వారిని స్వేచ్ఛగా నమ్ము" సనిచ్చెద మనియు, పన్నలకై వారిసరకుల గ్ర హింపమనియు శాసనమును వాయించి ప్రచురించెను. ఇకంతయు నె ట్లయిన రేవు పట్టణమునకు సభివృద్ధిలోనికిఁ దెచ్చి ద్వీపాంతరమ లతో వ్యాపారమును పెంపొందింప వలయునని మనఃపూర్వకముగాఁ జేసిన ప్ర యత్న మైనట్టు శాసనముం జదివిన వారికి స్పష్టముగా బోధపడఁగలదు?[1]*

see edit collections

  1. ఈశానసమును ఆంధ్రుల చరిత్రములని మూడవ భాగములో (180 పేజీ ప్రచురించియున్నాఁ డను, దీనింబరిశీలించి యే .వీరేశలింగము గారు “శ్లో | ఆహితత మశికృశాను ... ... ... శ్రీ సోమ మంతీ శ్వరః, ఆను వానిని గృహించి తమనవీన గ్రంధములో 138 పేజీలో జొప్పించయు న్నారు,