పుట:Srinadhakavi-Jeevithamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుష్ఠాధ్యాయము

73


పోయినట్లు గన్పట్టదు. ఇతఁడు ఆర్యధర్మములను బోషింపుచుండెను. వేదాధ్యయనసంపన్నులైన బ్రాహ్మణోత్తములకు తన తండ్రియొసంగిన యగ్రహారముల నన్ని టిని "పొడుటయేగాక తానును హేమాద్రి దాసఖండమునఁ జెప్పిన ప్రకారము గావించి కీర్తినీయుఁ డగు చుండెను. ఇతఁడు పట్టాభిషి క్తుఁడై న పిమ్మట రెండు సంవత్సరముల వరకును రామా ప్రెగ్గడ నంశములోని వాఁడగు మల్లి నాథుడు మంత్రిగ నుండినట్లు ఒంగోలు తాలూకాలోని మణి కేశ్వరము శాసనమువలన నూహీంపఁ దగియున్నది. ఆశాసనమునందు మల్లనమంత్రి స్వర్గస్థుఁడు కాగా సతని పినతమ్ముఁడు మంచి రాజు శాస్త్రయుక్తముగ నుత్తర క్రియలు నెఱవేర్చి పుణ్యర్ధము శా, శ. 1275 విజయసంవత్సర జ్యేష్ఠ శు 14 శనివారమునాఁడు తానావఱకు శ్రీ శైలములోని పాతాళగంగ పట్టుననుండి కొనివచ్చిన రెండు లింగములలో నొక దానిని మాండు కేశ్వ రస్వామి దేవాలయములో రావినూతుల పర్వతమల్లినాథ లింగస్వామి ప్రతిష్టాపన గావించెను. మఱియొక లింగమును శ్రీగిరిలింగ మనుపేర నెదుటనున్న మండపములో ప్రతిష్టాపన గావించెను. మఱియు నితఁడు శివ క్షేత్రమగు మణి కేశ్వరములోని యాశి వాలయమునకు నారామములు, భూములు మొదలగువానిని దానము చేసి ప్రఖ్యాతుఁ డయ్యెను. [1] ఈమల్ల నమంత్రి గాక మఱియొక మల్లనమంత్రి కలఁడని అమరావతీ శాసనములలోని యొక శాసనమువలన విదితమగుచున్నది. అతఁడు కేత చమూపతి కుమారుడైన మల్లినాథుఁ డనియు, వేముపృ ధ్వీశ్వరుని రాజ్య ధురంధరుఁ డైన మంత్రి యనియు, కులక్ర మూగతమైన మంత్రిత్వ పదవియం దుండెననియు నాశాసనము చాటుచున్నది. అట్టి మల్లి నాధమంత్రికి లక్కాంబిక యందు జనించిన వేమచమూపతి ధాన్య

వాటిపురమునందుఁ బ్రతిష్టాపింపఁబడియున్న యమరేశ్వర దేవుని శా.

  1. * నెల్లూరిశాసము 3 వ. సంపుటము , ఒంగోలుశాసనము 1810పేజీ 1:028*