పుట:Srinadhakavi-Jeevithamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

శ్రీసాథ కవి

1350 దవ సంవత్సరమున సింహాసనమెక్కి రాజ్యబారమును వహించి క్రీ.శ 1392 వరకు రాజ్య పాలము గావించెను.వేమ భూపాలునకున ఆనపోతరెడ్డి కోమటి రెడ్డి అను ముగ్గురు కొమాళ్లును, దొడ్డాంబిక, వేమాంగిక అను ఇద్దరు కుమార్తెలు గలరు. కోమ టి రెడ్డి చిన్నవయస్సుననే గతాను వయెనుదొడ్డాంబిక ను కాటయ రెడ్డికిని, వేమాంబికను నల్ల నూకయ రెడ్డికి నిచ్చి వివాహము గావించెను. అనపోత రెడ్డి "వేమభూపాలునకుఁ గూరిమి పుత్రుడు. అనపోత రెడ్డి రాజ్యభారమును వహించి తండ్రి పోయినమార్గమును బట్టి ప్రజారంజకముగ రాజ్యపరిపాలనము చేసి తండ్రికి గీర్తియు, రాజ్యమునకు వన్నె యి. దెచ్చెను. తోబుట్టువుల భర్తలును సేనాపతులు నై నకాటయ రెడ్డియు,నల్ల నూకయ రెడ్డియు నాతనికి రెండు భుజ ములుగానండిరి. సోదరుఁడును ప్రచండ సేనానియునగు అనవేమరెడ్డియు, విధేయుఁడై యుండెను. దక్షిణమునుండి కర్ణాటకులును, పశ్చిమమున నుండి పద్మనాయకులును, అప్పటప్పట రాచవారును రెడ్డి రాజ్యమును స్వాధీనము చేసికొనవలయునని ప్రబల ప్రయత్నములు చేయుచువచ్చిరి. గాని అనపోత రెడ్డి సమర్థుఁడును, నరాక్రమవంతుఁడు నై నందున వై రివీర మదభంజనుడై తన రాజ్యమును సంరక్షించుచకొనుచుఁ బొగడ్తలను గాంచెను. క్రీ. శ.1321 వ సంవత్సరమున రేచర్ల సింగమనాయని పుత్రులు' అనపోత నాయఁడును, మాదానాయకుడును బహుళ సైన్యము లతో దాడి వెడలివచ్చి ధాన్య నాటీపురమును (ధరణికోట) ముట్ట డించినప్పుడు, అనపోత రెడ్డి ప్రచండవిక్రమార్కు డై భూరి సైన్య ములతో వారల నెదుర్కొనీ ఘోరసంగ్రామమును సలిపి కృష్ణా నది కావలి ప్రక్కకు దరిమెను. అంత వారల పరీభవమునకోర్వఁజాలక తీరుపట్లు పడుచు తుచకు తురుష్కులు స్వరాజధాని పైదండెత్తి వచ్చినారను వర్తమానము రాగా బునః ప్రయత్నమును మానుకొనిమరలిపోయిరి; 'అనపోత రెడ్డి 'యే " యుద్ధమునందు 'సోడి