పుట:Srinadhakavi-Jeevithamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

శ్రీ నా థ కవి


గాదు. ఆ కాలమున నిప్పటిగోదావరీ మండలము కోరుకొండ రాజధానిగాఁ జేసికొన్న మంచికొండడ కూనా రెడ్డి యొక్కయుఁ నతని కుమారుఁడు ముమ్మిడినాయకుని యొక్కయుఁ బాలనమునందున్నట్లు ముమ్మిడినాయపని యార్యవట శాసనాదులు వేనోళ్ళ ఘోషించుచున్నవి. ఆశాసనముల యం దెచ్చోటను కోరుకొండ రెడ్లు ప్రోలయ వేమారెడ్డికి లోబడిన వారని చెప్పండియుండ లేదు. అందువలన పై వేమభూ పొలుఁడు మహా నదియైన గోదావరీ వఱకుఁ గల దేశమును మాత్రమే పరిపాలించియుం డును. మంచికొఁడ కూనారెడ్డికి తురుష్కులను జయించుటకుఁ దోడ్స డినవారు ప్రోలయ నాయకుఁడును నాతని పుత్రుడు కాపయనాయ కుఁడు నని యార్యవట శాసనమునుబట్టి యూహింపఁదగియున్న ది. వేమా రెడ్డియే కాపయనాయకుడని వ్యవహరింపఁబడియుండిన యెడల జయంతి రామయ్య గారి యూహ సరియైన దనవచ్చునుగాని యందునకుఁ బ్రమా ణము గానరాదు. అమరావతీ శాసనములో 'మాద్యన్మన్నెనృపాల ' అని చెప్పుటచేఁ గళింగ దేశము లోని కొండ రాజులను జయించిన మాత్రముచేత నా దేశమును గళింగ దేశమని కొని, కళింగ దేశమును బరిపొలిచెననిగానీ యెట్లు చెప్పనగును? ఇతర ప్రమాణము 'లేవియుఁ గానరాకుండునప్పుడు వేమారెడ్డి కళింగ దేశమును బరిపాలిం చినని సిద్ధాంతము చేయరాదు. ఎజ్రా ప్రెగ్గడ యను మహాకవి యితని యాస్థానమునందేయుండి హరివంశమును రామాయణము నీతని కంకి తము గావించేను. "వేమారెడ్డి అహోబల శ్రీపర్వతముల రెంటికిని సోపా నములను గట్టించి ప్రసిద్ధికెక్కి నవాఁడు. ఇతఁడు శైవభక్తుఁడయినను పరమత సహనముగల వాఁడు. ఇతఁడు 1350 వఱకుఁ బరి పాలనము

చేసెను. "[1]

  1. *ఆంధ్రకవుల చరిత్ర మనండు ప్రోలయ నేమా రెడ్డి 1328 వ సంవత్సరమునందు స్వతంత్రుడై. వీరుకొండ రాజ్యము "నాక్రమించుకొని 1335 వ సంవస్సరము