పుట:Srinadhakavi-Jeevithamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాధ్యాయము

65


ఇంకను శాస్త్రిగారు :-- శ్రీనాధుఁడు కృష్ణయజు ర్వేద.ము నధ్యయనము చేసినాడు. స్వ"వేద శాఖాధ్యయనము బాహ్మణుని కాపశ్యక కార్యమని స్మృతి కారు లనిరి. దాని నీతఁడు పాటించెను. అధ్యయనముఁ జదివి మఱుచుచంద మునగాక చక్కగానుపస్థితిలో నండునట్లే చేసెను. ఈయర్ధము “ అధ్వర్యు వేద శాఖాధీకినిష్ణాతు” అన్న పదమెఱిఁగించుచున్నది. అధ్వ ర్యు వేద శాఖ యనఁగా గృష్ణయజు ర్వేదము ఉభయభాషాకవియై శ్రీనా థావదాని' యనియె గాక వేదాధ్యయనపరుఁడై శ్రీనాథావధాని' యని కూడ శ్రీనాధుఁడు పేర్కొనఁదగినవాఁ డయినాఁడు." అని తమగంథమునందలంకరించిరి. ఆ కాలమున గురుముఖమునఁగాని యిట్టియోగము సంప్రాప్తముగాదని ప్రభాకరశాస్త్రిగా రొప్పుకొనక తప్పదు. పల్వురు గురువులున్నారని చెప్పుటవలన శ్రీనాధుని కుశాగ్రబుద్ధికిని నద్భుతప్రతిభకును భంగమువాటిల్లును గావున శ్రీనాధుని కొక్కఁడే గురువుఁడవలయునని చెప్పెడివారు ప్రభాకరశాస్త్రి గారె గదా ప్రభాక రశాస్త్రి గారి యభిప్రాయము ననుసరించి తన్న వధానిగ నొనరించిన వేద వేదాంగవిదుఁడైన గురువుకడ నే శ్రీనాధుఁను శ్రౌతనూత్రదుముల తోఁ బాటు కామసూత్రములను బఠించినాడు. అష్టాదశస్మృతులను, అష్టాదశపురాణములను, ఉపపురాణములను, సాంఖ్య యోగ సిద్ధాంత ములను శైవాగమమ:లను జదివినాఁడు. మఱియు నావిద్యలను ముద్దలు చేసి మ్రింగినట్టుగా నశ్రమమున గ్రహించి వ్యుత్పత్తి నార్జించినాఁడు. మాహారాష్ట్రి, శౌరసేని మొదలగు ప్రొకృతభాషలందు బరిజ్ఞాన పాట వము గడించినాఁడు. పతంజలి ప్రణీతమగు వ్యాకరణ మహాభాష్యమును బాగుగాఁ బఠించినాఁడు. న్యాయపైశేషిక దర్శనములందుఁ గౌసల్య ముగాంచినాఁడు. వీనిపై వ్రాయఁబకిన భాష్యకర్త ల గ్రంధముల నన్ని టిని సభ్యసించెను. అతనిక డి నే పూర్వకవి ముఖ్య విరచితా పూర్వకా వ్యభావరససుధాచరణ ప్రౌడత యును గాంచినాఁడు.