పుట:Srinadhakavi-Jeevithamu.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
64
శ్రీ నా థ కవి


నకు భక్తుఁడనియు, వేద శాస్త్రాది విద్యాని మాధుఁడనియుఁ దెలియఁ జేయు పద్యములను నిశ్శంక కొమ్మనామాత్యుని శివలీలా విలాసమును ప్రబంధము నుండి యుదాహరించి కడపట నిట్లు వ్రాసిరి.

1: వేద శాస్త్రాదివిద్యోపదేశము చేఁ గాక యభీమయ గురువఱే ణ్యుఁడు శైవమంత్రుద్యుపదేశముచే సతనికి గురుడయి యుండవచ్చును."

మామిత్రులగు ప్రభాకరశాస్త్రి గారి పై 'వాక్యములు శ్రీనాథుఁడు తన కాశీఖండములోఁ జెప్పుకొన్న దానికీఁ గేవలము భిన్నములుగా నున్నవి. తనకు సంభవించిన సాహిత్య సౌష్ఠనమునకు కారణంబులు సుద్బోధకములుగ నుండు వానిలో ఘోడె రాయాంక సద్గురు రాజ భీమేశ్వరస్వామి పదసమారాధనంబు* నొకటిగాఁ జెప్పుకొనియున్నాడు గాని శైవమం త్రాద్యుప దేశ ప్రశంసను సలిపి యుండ లేదు. వేదశాస్త్ర ధికవిద్యా నిరూఢతవదిన సరస్వతి నదువు వాడని వర్ణింపఁబడిన శైవ గురువు శైవమం త్రాద్యుప దేశమును జేయుగలిగి వేష శాస్త్రాది విద్యోప దేశము చేయఁజాలి యుండక పోవునా! మొదటి దాని సంగీక రించినపుడు రెండవవాని నంగీకరింపకుండుటకుఁ గారణ మేమి? ఈ ప్రశ్నమునుండి తప్పించుకొనుటకై : "పయివిదన మునఁ బరామర్శింపబడిన యా "కాశీఖండ పద్యము శ్రీనాథుని బాల్య విద్యాభ్యాసవిషయము దెలుపుపునదిగా : దోపకున్న "దని వ్రాయుచున్నారు.

మఱియు కాళీఖండముస, "బేర్కొనఁబడిన భీమయ శ్రీనాథునకు సంతా ద్యుప దేశకర్తయ యగు గురునై యుండవచ్చునని యొక వంక ఘోషించుచు కాశీ ఖండక రచనాకాలముని నాతనికి దాతాత్కాకోత్సా హ కారణముగా భీముయగుకుని బ్రస్తుతించినాఁడుగాని, 'ఉపలబ్ధమైన శ్రీనాథుని గ్రంధములం దాతని గురువెవ్వరో తెలియకున్నాడని యింకొకవంక ఘోషించుచున్నారు. ఇది 'యేమి ఘోష , శైవమంత్రా ద్యుపదేశకర్తయగు గురువు గురువుకాడనయా వీరియుభిప్రాయుము?