పుట:Srinadhakavi-Jeevithamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాధ్యాయము

63


నభ్యసింపక యేయలవఱచుకొన్నాఁడేమో యను సంశయమున కీ క్రింది పద్యమవకాశముక లిగించుచున్నది.

శా. బాహ్మీదత్తపం ప్రసాడుఁడవు వుగుప్రజావిశేషోదయా
జిహ్వాస్వాంతుఁడ వీశ్వరార్చన కళాశీలుండ నభ్యర్హిత
బహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత
బ్రహ్మజ్ఞాన కళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే.

అని శృంగార నైషధములోని పద్యము నుదహరించిరి.
కాని శ్రీనాథుఁడే తన కాశీఖండమున నొక చోటఁ జొప్పించిన: -

గీ.శాస్త్రమా ర్యుసన్నిధి జదువఁడేని
యిద్ధబోధంబు మది సంగ్రహీంపఁడేని ,
తెగువమిఱిప్రతిజ్ఞ సాధింపఁడేని
జ్ఞాతిజయమంద డేని తజ్జనుఁడుజనుఁడె.

అను పద్యము నడ్డమువచ్చి తమ యభిప్రాయమును ఖండించుటచేత “విద్యోపలబ్ధికిఁ గూడ నుద్భోధకముగాఁ గొంత గురుశుశ్రూష యుండ వలసినదే యగును. శాస్త్రాధ్యయనము గురునియొద్దఁ జేయవలసినదే* యనివక్కాణించుచుఁ పై బ్రాహీదత్త మను పద్యము నాధారముగా గొని శ్రీనాథునకు విద్యాగురువు లేఁడని తలంప రాదు” శ్రీనాథుని చిరకాల విద్యాభ్యసనమను జాడ్యము పాలు గావించిరి.

శ్రీప్రభాకరశాస్త్రి గారు శ్రీనాథునికి గురువున్నాఁడని యెప్పుకో వలసిన వారై యున్నారు గనుక నింక నాగురు వెవ్వరని వెదక నారం భించిరి. తాత కమలనాభుని గురువునిగాఁ జేయఁ బ్రయత్నించియు నది సాధ్యపడనందున కమలనాభుని సాదుపదేశముల నీతఁడు కాంచె సనిగాని లేదనిగాని స్పష్టపఱుప నాధారములుగారా"వని యాతని వద లుకొన్నారు. ఇంక మిగిలి పట్టుకొనవలసిన వాడు ఘోడెరాయభీమయు గురువ రేణ్యుఁడు. ఇతఁడల్లాడ వేమారెడ్డి వీరభద్రా రెడ్ల కుల గురువనియుఁ వీరభద్రాచల (పట్టిసము) నిలయుఁడగు .వీరభద్రేశ్వరు,