పుట:Srinadhakavi-Jeevithamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీ మూధ్యాయము

56


బహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధ్వాత బ్రహ్మజ్ఞానకళా నిధానమ' వని యాంధ్ర నైషథకృతిపతియైన మామిడిసింగనామాత్యుః డు పలికినట్లుగాఁ జెప్పుకొనియెను. శ్రీనాథుకు తన భీమేశ్వరపురా ణములోఁ గాళిదాసుని రసభావ భావనామహనీయ కవితాసముల్లాసునిగా ను భట్టభాణుని నిరవద్యగద్యపద్య నిబంధపరితోషిత స్థాణునిగాను, ప్రవర సేనుని సాహిత్య పదవీ నుహా రాజ్య భద్రాసనాసీ సునిగాను, శ్రీహ ర్షుని సంబోధి నార్వీ చిగంభ తొసార జాక్సముత్కర్షునిగాను స్తుతించి భావశివభధ్ర సౌమిల్ల భల్లులకుల మాఘభారవిబిల్హణులకును భట్టిచిత్త వకవిదండి పండితుకునుఁ గేలుదోయి నొసలిపై ఁ గీలు గొలిపెను. ఇమ్మ హాకవుల కావ్యముల నెల్ల నీతఁడు పఠించియుండుననుటకు సందియము లేదు. ఇంకఁ గవి తామహాత్మ్యముననో ! బ్రాహ్మీద త్తవరప్రసాద లబ్ధకవితాధురంధరుండగుటఁ జెప్పనక్కరయే లేదు. ఇతఁడు శృంగార నైషధకర్తయగు భట్టహర్షుని షట్కు మర్మక చక్రవర్తి' యని చెప్పి యున్నాఁడు. ఇతనిం గూ- 'షట్తర్కమర్మైక చక్రవర్తి' యని మన ము చెప్పవచ్చును.*[1]

ఇట్టివాడగుటం జేసి శ్రీనాథుఁడు 'సకలవిద్యాసనాథుఁడను పట్టము నొంది కొండవీటినగరంబున శ్రీ పెదకోమటి వేమభూ పాలవర్యుని


  • షట్తర్కములనఁగా షడ్డర్శములనీ యాధునికులు కొందరు తలంచిరి. పూర్వు లచే ఈ రెండును వేఱవేఱని తెల్పబడి యున్నవి. కవికల్పలత లో:- (షడ్వజ్రకోణ త్రిశిరోనేత్ర తర్కాదర్శనమ్ చక్రవర్తి మహా సేనపద నర్తుగుణారసా, సౌగత నైయాయిక యోగ సాంఖ్య వైశేషిక నా స్తికమతములుషట్తర్కములు, (స్యాద్యాద వాద్యార్హతః స్యాత్ ) శూన్య నాడీతు సౌగతః నైయాయిక్వాక్ష పాదో, యోగి ! 'సాంఖ్యను కాపీల వైశేషిక ః స్యాదౌలూక్యో, బార్హస్పత్యమునా స్తిక, జార్వాకో కౌ కాయతీక శ్చై తేషడకి తార్కి కాట” హేమాచార్యుఁడు, శ్రీ వేదమువేంకట గాయశా స్త్రీ ఈ చితసర్వం, షాహ్యఖ్యా సమేత .. ముద్రిత శృంగార నైషగ్రంథము. "పేజీ 11